Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన

మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ కుమార్ గౌడ్ స్పందన

వార్త 2 days ago

Meenakshi Natarajan nomination: మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై తీవ్ర చర్చ నడుస్తోంది.

ఈ పరిణామంపై తెలంగాణ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

Read Also : Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ నామినేషన్ కేసు.. రేపు సుప్రీంకోర్టులో కీలక విచారణ!

 Mahesh Kumar Goud’s reaction to the rejection of Meenakshi Natarajan’s nomination.

Meenakshi Natarajan nomination: నిబంధనల్లో ఎక్కడా లేని విషయాన్ని సాకుగా చూపారు

మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించిన తీరును మహేష్ కుమార్ గౌడ్ పూర్తిగా తప్పుపట్టారు. “ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకుని ఆమెకు నోటీసులు పంపడం వెనుక రాజకీయ శక్తుల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం కాంగ్రెస్ అభ్యర్థులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు” అని ఆయన విమర్శించారు.

ఎన్నికల నిబంధనలను అధికారులు తమకు నచ్చినట్లు వాడుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ తిరస్కరణకు చూపిన కారణంలో ఎలాంటి చట్టబద్ధత లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక అభ్యర్థిపై కోర్టు నోటీసులు ఉంటే.. ఆ వివరాలను ఖచ్చితంగా ఎన్నికల నామినేషన్ అఫిడవిట్‌లో పేర్కొనాలనే నిబంధన చట్టంలో ఎక్కడా లేదు. కేవలం క్రిమినల్ కేసుల వివరాలను మాత్రమే వెల్లడించాల్సి ఉంటుంది. నిబంధనల్లో లేని అంశాన్ని సాకుగా చూపి నామినేషన్‌ను తిరస్కరించడం ముమ్మాటికీ బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యేనని ఆయన దుయ్యబట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

భారతీయ ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha