Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

మీనాక్షి నటరాజన్‌కు భారీ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

వార్త 2 months ago

Meenakshi Natarajan: రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞురాలైన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు గట్టి షాక్ తగిలింది.

మధ్యప్రదేశ్ కోటా నుండి రాజ్యసభకు పోటీ చేసేందుకు ఆమె సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి (RO) తిరస్కరించినట్లు విశ్వసనీయ సమాచారం.

రాజ్యసభ రేసు నుండి అవుట్!

ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమపై ఉన్న క్రిమినల్, సివిల్ కేసుల పూర్తి వివరాలను నామినేషన్ దాఖలు చేసే సమయంలో ‘అఫిడవిట్’ రూపంలో తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ తనపై ఉన్న ఒక కీలక కేసును ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని ప్రత్యర్థి పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ (BJP) ఆరోపించింది.

Read also: Congress : మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మీమే అధికారంలో - సీఎం రేవంత్

హైదరాబాద్ కోర్టు కేసును దాచారంటూ ఈసీకి బీజేపీ కంప్లైంట్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ఒక న్యాయస్థానంలో మీనాక్షి నటరాజన్‌పై ఒక కేసు పెండింగ్‌లో ఉంది. ఈ విషయాన్ని ఆమె తన రాజ్యసభ నామినేషన్ అఫిడవిట్‌లో ఎక్కడా ప్రస్తావించకుండా తొలగించారని బీజేపీ అభ్యర్థి రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఆధారాలతో సహా ఎన్నికల అధికారికి అధికారికంగా రాతపూర్వక ఫిర్యాదు చేయడంతో, ఆ పత్రాలను నిశితంగా పరిశీలించిన రిటర్నింగ్ అధికారి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజాలను దాచిపెట్టినందుకే ఎన్నికల సంఘం ఈ చర్య తీసుకుందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

మహిళా స్వయం సహాయక సంఘాలకు బస్సులు అందజేసిన రేవంత్ రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha