Dailyhunt
మీర్జాపూర్‌లో ఘోర ప్రమాదం: 11 మంది సజీవ దహనం!

మీర్జాపూర్‌లో ఘోర ప్రమాదం: 11 మంది సజీవ దహనం!

వార్త 1 week ago

Mirzapur Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్-రీవా జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, అందులో ఎక్కువ మంది బొలేరో వాహనంలోనే సజీవ దహనమయ్యారు.

Read Also:Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్‌లో బస్సు బోల్తా.. ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు!

Mirzapur Road Accident: ప్రమాదం ఎలా జరిగింది?

ఢీకొన్న వెంటనే బొలేరో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. లోపల ఉన్న వారు బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో డ్రైవర్‌తో సహా 9 మంది అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది.

 Mirzapur Rewa Highway Road Accident

మధ్యప్రదేశ్ నుంచి కంకర లోడుతో వస్తున్న ఒక ట్రక్కు (ట్రైలర్) డ్రామాండ్‌గంజ్ లోయ నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి.నియంత్రణ కోల్పోయిన ట్రక్కు తొలుత ముందున్న స్విఫ్ట్ కారును ఢీకొట్టింది. ఆ ధాటికి కారు మరో ట్రక్కు మధ్యలో నలిగిపోయింది. ఇదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న బొలేరో వాహనం కూడా ట్రక్కును బలంగా ఢీకొట్టింది.అయితే మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతుల గుర్తింపు ప్రక్రియ కష్టంగా మారింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

అనంతపురంలో 'హనీ' వేట.. ఖాకీల అండతో లక్షల దోపిడీ.. బట్టబయలైన ఆడియో టేపులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha