Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మీరు 'మెహఫిల్' బిర్యానీ తింటున్నారా? అయితే ఇది చూడండి!

మీరు 'మెహఫిల్' బిర్యానీ తింటున్నారా? అయితే ఇది చూడండి!

వార్త 6 days ago

Mehfil Hyderabad:హైదరాబాద్ నగరంలొని మెహఫిల్ మరియు షా గౌస్ తనిఖీలు ఆహార ప్రియులను కలవరపెడుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఈ ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.

అక్కడ వంట గదులు మరియు పరిసరాలు అత్యంత దయనీయంగా ఉన్నట్లు గుర్తించారు. నాణ్యమైన ఆహారం అందిస్తారని నమ్మే కస్టమర్లకు ఈ వార్త షాకింగ్ గా మారింది. అధికారులు బయటపెట్టిన దృశ్యాలు హోటల్ యాజమాన్యాల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Read also: Ethiopia Girl Cancer Death Shamshabad: బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..ల్యాండింగ్‌కు ముందే బాలిక మృతి!

 Are you eating ‘Mehfil’ biryani? Take a look!

మెహఫిల్ రెస్టారెంట్ లో అపరిశుభ్ర వాతావరణం

హైటెక్ సిటీ మెహఫిల్ రెస్టారెంట్ తనిఖీల్లో అధికారులకు షాకింగ్ విషయాలు కనిపించాయి. కిచెన్ అంతా అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా నేలంతా తడిసిపోయి ఉంది. గ్రిల్డ్ చికెన్ వంటి మాంసాహారాలను నిల్వ చేసిన తీరు అస్సలు బాలేదు. ముఖ్యంగా నిర్మాణానికి వాడే సామాగ్రి పక్కనే రుమాలీ రోటీలు తయారు చేయడం తీవ్ర అభ్యంతరకరం. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నట్లు తేలింది.

Mehfil Hyderabad:షా గౌస్ లో కూడా అదే పరిస్థితి

గచ్చిబౌలిలోని షా గౌస్ రెస్టారెంట్ కూడా తనిఖీల్లో విఫలమైంది. అక్కడ కూడా మెహఫిల్ లాంటి అపరిశుభ్ర పరిస్థితులే ఉండటంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గదుల్లోని ఆహార పదార్థాల నాణ్యత మరియు నిర్వహణ తీరు సరిగ్గా లేదు. ఇలాంటి ప్రసిద్ధ హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల కస్టమర్లు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆహార నాణ్యతపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Epaper: epaper.vaartha.com

బోరబండలో మంత్రుల చేతుల మీదుగా పల్స్ పోలియో ప్రారంభం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha