Masoud Pezeshkian: అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇరాన్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజష్కియాన్ తన పదవికి రాజీనామా చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సైనిక దళాల మితిమీరిన జోక్యంపై తీవ్ర అసంతృప్తితోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి ఇప్పటికే పంపినట్లు అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రముఖ ఇరాన్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది.
Read Also : Trade Deal : రేపటి నుంచి ఇండియా-US చర్చలు
Iranian President Masoud Pajhwokian resigns?
Masoud Pezeshkian resignation: రాజీనామా వార్తలను ఖండించిన ఇరాన్ ప్రభుత్వం
అంతర్జాతీయ మీడియా ప్రకారం.. ఇరాన్ దేశ పాలనా అధికారాలు పూర్తిగా ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని అధ్యక్షుడు పెజష్కియాన్ తన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి వ్యూహాత్మక, కీలక నిర్ణయాల విషయంలో ఇరాన్ ప్రభుత్వ అధికారిక యంత్రాంగాన్ని, ఎన్నికైన ప్రజాప్రతినిధులను పూర్తిగా పక్కన పెడుతున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా తనకు ఉన్న అధ్యక్ష బాధ్యతలను సైతం నిర్వర్తించనివ్వకుండా అడ్డుకుంటున్నారని పెజష్కియాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సదరు పత్రిక పేర్కొంది. అయితే, ప్రస్తుత సున్నితమైన పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఈ రాజీనామా లేఖపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం.
ఈ సంచలన వార్తలపై ఇరాన్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. అధ్యక్ష కార్యాలయ కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి ఈ కథనాలను పూర్తిగా తోసిపుచ్చారు. ప్రస్తుతం అమెరికాతో కీలకమైన దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో.. ఇరాన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు అంతర్జాతీయ మీడియా తప్పుడు రిపోర్టులతో ‘మీడియా గేమ్స్’ ఆడుతోందని ఆయన మండిపడ్డారు. తుర్కియే ప్రభుత్వ అధికారిక పత్రిక కూడా ఇరాన్ ప్రభుత్వ ఖండనను సమర్థిస్తూ కథనాలను ప్రచురించింది.
ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ అంతర్గత సంక్షోభం ఇలా ఉంటే.. అటు అమెరికాతో జరుగుతున్న శాంతి ఒప్పంద ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్ పంపిన శాంతి ఒప్పంద ప్రతిపాదనల ముసాయిదాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. తాజా డ్రాఫ్ట్‌లో 60 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ, వ్యూహాత్మక హార్మూజ్ జలసంధిని తెరిచేందుకు చర్యలు వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ట్రంప్ మాత్రం ఇరాన్ తన అణ్వాయుధాల తయారీని, అణు కార్యక్రమాలను పూర్తిగా, శాశ్వతంగా వదిలేయాలనే ప్రధాన షరతుపై మొండిగా ఉన్నారు. దీంతో పాటు హార్మూజ్ జలసంధి నియంత్రణపై మరికొన్ని కఠిన మార్పులను అమెరికా కోరుతోంది. ఈ నేపథ్యంలో తాము శాంతి ఒప్పందం కోసం ఎలాంటి తొందరపాటు పడబోమని ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా కఠిన వైఖరిపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ సార్వభౌమత్వాన్ని, దేశ హక్కులను, ప్రయోజనాలను పణంగా పెట్టి, వాటిని కాపాడలేని ఏ రకమైన అంతర్జాతీయ ఒప్పందానికి తాము అంగీకరించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. అమెరికా ఒత్తిళ్లకు లొంగబోమని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు గరిష్ఠ స్థాయికి చేరిన ఈ తరుణంలోనే, ప్రెసిడెంట్ పెజష్కియాన్ రాజీనామా వార్త రావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

