Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిత్రదేశానికి ట్రంప్ 'బిగ్ షాక్'.. 5 వేల మంది సైనికులు ఔట్!

మిత్రదేశానికి ట్రంప్ 'బిగ్ షాక్'.. 5 వేల మంది సైనికులు ఔట్!

వార్త 1 month ago

Donald Trump: అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన 'అమెరికా ఫస్ట్' విధానంతో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచారు. అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన జర్మనీకి గట్టి షాక్ ఇస్తూ..

అక్కడ మోహరించిన సుమారు 5,000 మంది అమెరికా సైనికులను వెనక్కి రప్పించాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ వ్యవహారంలో జర్మనీ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ట్రంప్, ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

Read Also:Kashmir Issue: భారత్‌పై మరో భారీ ఉగ్రకుట్రకు పాక్ పన్నాగం!

విభేదాలకు కారణం ఇదే..

జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మరియు ట్రంప్ మధ్య నెలకొన్న దౌత్యపరమైన విభేదాలే ఈ బలగాల కోతకు ప్రధాన కారణం. ఇరాన్ విషయంలో అమెరికా వ్యూహాలను మెర్జ్ బహిరంగంగా విమర్శించడం, వాషింగ్టన్ తీరును తప్పుబట్టడం ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించాయి. “మా రక్షణ అవసరం లేదనుకున్నప్పుడు, మేము ఉచితంగా సైనిక రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు” అనే సంకేతాన్ని ట్రంప్ ఈ నిర్ణయం ద్వారా పంపారు.

Donald Trump: సైనిక వ్యూహంలో మార్పులు

ప్రస్తుతం జర్మనీలో ఉన్న 36,000 మంది సైనికుల్లో 14 శాతం మందిని వచ్చే 6 నుండి 12 నెలల్లో వెనక్కి తీసుకోనున్నారు. వీరందరినీ తిరిగి అమెరికాకు గానీ, లేదా వ్యూహాత్మకమైన ‘ఇండో-పసిఫిక్’ ప్రాంతానికి గానీ తరలించాలని పెంటగాన్ యోచిస్తోంది. జర్మనీ తన రక్షణ బడ్జెట్‌ను పెంచుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని బలగాలను ఉపసంహరించుకుంటామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు.

నాటో కూటమిలో ఆందోళన

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం యూరప్ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. రష్యాను అడ్డుకోవడానికి జర్మనీలో ఏర్పాటు చేసిన కీలక కమాండ్ సెంటర్ల భద్రతపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జర్మనీ ఇకనైనా తన బాధ్యతను గుర్తించాలని, అమెరికాపై భారం వేయడం మానుకోవాలని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఇరాన్‌తో యుద్ధం ముగిసింది: వైట్ హౌస్ సంచలన ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha