Mobile Recharge Plans: మొబైల్ వినియోగదారులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక ఊరటనిచ్చింది. ముఖ్యంగా మొబైల్ డేటా అవసరం లేని వినియోగదారులకు మరిన్ని రీఛార్జ్ ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లు, Voice+SMS-only రీఛార్జ్ వోచర్లు అందించేలా కొత్త నిబంధనలను TRAI తీసుకొచ్చింది.
Read Also :Gold Rate Today: తగ్గిన బంగారం, వెండి రేట్లు!
28 రోజుల రీఛార్జ్‌కు బదులు 30 రోజుల ఆప్షన్

ప్రస్తుతం కొన్ని టెలికాం కంపెనీలు 28 రోజుల వ్యాలిడిటీతో నెలవారీగా కనిపించే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. దీంతో ఏడాదిలో 12 నెలలకు బదులుగా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుందని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో ప్రస్తావించారు. తాజా TRAI నిబంధనలతో 30 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్లాన్లకు కూడా అవకాశం కల్పించబడింది. రాఘవ్ చద్దా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఇది 28 రోజుల రీఛార్జ్ సైకిల్‌పై తాను లేవనెత్తిన అంశానికి పరిష్కారంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
డేటా అవసరం లేని వారికి ప్రత్యేక ప్లాన్లు
చాలామంది వినియోగదారులు తమ మొబైల్ ఫోన్లను ప్రధానంగా కాల్‌లు, SMSల కోసం మాత్రమే ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ఫీచర్ ఫోన్లు, సీనియర్ సిటిజన్లు, తక్కువ డేటా అవసరం ఉన్న వినియోగదారులకు డేటా కలిపిన ప్లాన్ల వల్ల అదనపు ఖర్చు అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో డేటా లేకుండా కేవలం Voice+SMS అందించే Special Tariff Vouchers (STVs)ను మరిన్ని వ్యాలిడిటీలతో అందించేలా TRAI నిబంధనలు తీసుకొచ్చింది.
30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీలకు Voice+SMS ప్లాన్లు
కొత్త నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు ఇప్పటికే అందిస్తున్న Voice+SMS+Data ప్లాన్‌లలో 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న ప్రతి ప్రత్యేక వ్యాలిడిటీకి అనుగుణంగా Voice+SMS-only వోచర్‌ను కూడా అందించాల్సి ఉంటుంది. అదే విధంగా ఎక్కువ కాలవ్యవధి ఉన్న డేటా-బండిల్డ్ ప్లాన్‌లకు అనుగుణంగా కనీసం ఒక దీర్ఘకాలిక Voice+SMS-only STVను కూడా అందించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ల ధరల్లో సేవల తగ్గింపుకు అనుగుణంగా తగినంత తగ్గింపు ఉండాలని TRAI నిబంధనలు పేర్కొంటున్నాయి. కొత్త నిబంధనల్లో నెలవారీ రీఛార్జ్ విషయంలోనూ మార్పు ఉంది. వినియోగదారులు ప్రతి నెల ఒకే తేదీన రీన్యూ అయ్యే ప్లాన్ను పొందే అవకాశం ఉంటుంది. ఒక నెలలో ఆ తేదీ లేకపోతే.. ఆ నెల చివరి రోజున వ్యాలిడిటీ ముగిసేలా నిబంధనలు ఉన్నాయి.
Airtel, Jio, Vi వంటి కంపెనీలపై ప్రభావం
కొత్త నిబంధనలు దేశంలోని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు వర్తిస్తాయి. దీంతో Airtel, Jio, Vodafone Idea (Vi) వంటి కంపెనీలు తమ ప్రస్తుత బండిల్ ప్లాన్‌లకు అనుగుణంగా మరిన్ని Voice+SMS-only ఆప్షన్లను అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. TRAI ఇప్పటికే Voice+SMS-only ప్యాక్‌లను డేటా లేకుండా కాల్స్, మెసేజ్‌లను అందించే ప్రీపెయిడ్ ప్లాన్‌లుగా నిర్వచించింది. ఇలాంటి ప్యాక్‌లకు ప్రస్తుతం 365 రోజుల వరకు వ్యాలిడిటీ ఉండవచ్చని TRAI వివరిస్తోంది.
Mobile Recharge Plans: రాఘవ్ చద్దా హర్షం
ఈ మార్పులను రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా స్వాగతించారు. 28 రోజుల రీఛార్జ్ సైకిల్, డేటా అవసరం లేని వినియోగదారులకు సరసమైన ప్లాన్‌ల కొరత వంటి అంశాలను తాను పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త నిబంధనలతో వినియోగదారులకు తమ అవసరానికి అనుగుణంగా రీఛార్జ్ ఎంపిక చేసుకునే అవకాశం పెరుగుతుందని ఆయన అన్నారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకుల కార్యకలాపాలు

