PM Modi cabinet : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశం దేశ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరలేపబోతోంది. ఇది పైకి సాధారణ రివ్యూ మీటింగ్‌లా కనిపిస్తున్నప్పటికీ..
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ (క్యాబినెట్ ప్రక్షాళన) పై ఇందులో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు, వివాద రహిత ఇమేజ్ లాంటి అంశాల ప్రాతిపదికగా కొందరిపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవడంతో, పాతిక మందికి పైగా మంత్రులకు ఇదే చివరి మీటింగ్ కావచ్చని ప్రచారం నడుస్తోంది.
ఇంటర్నేషనల్ సవాళ్లు.. ప్రత్యేక ప్రజెంటేషన్లు
మోదీ సర్కార్‌లోని 30 మంది క్యాబినెట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర హోదా మంత్రులతో కలిపి మొత్తం 72 మంది సభ్యులు ఈ ఏడాది మొదటిసారి ఒకే చోట సమావేశం కానున్నారు. గత రెండేళ్ల ప్రగతి, సంక్షేమ పథకాల అమలుతో పాటు పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ప్రధాని చర్చించనున్నారు. డజనుకు పైగా కీలక శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో స్పెషల్ ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్, ఒడిశా, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాల సమీకరణాలు ఈ మార్పులపై ప్రభావం చూపనున్నాయి.
Read Also: అమెరికా ఆంక్షలతో సంబంధం లేదు..రష్యా చమురు కొనుగోళ్లపై భారత్ స్పష్టత
PM Modi cabinetతెలుగు రాష్ట్రాల మంత్రులపై వేటు పడనుందా?
తెలంగాణలో ఇటీవల కేంద్రమంత్రి బండి కొడుకు బండి భగీరథ్‌పై పోక్సో (POCSO) కేసు నమోదు కావడం, ఆయన రిమాండ్‌లో ఉండటం తీవ్ర సంచలనం రేపింది. ఈ క్రమంలోనే తన కొడుకును కాపాడుకునేందుకు బాధిత కుటుంబాన్ని బెదిరించారనే ఆరోపణలతో బండి సంజయ్‌ను మంత్రి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరగబోయే ప్రక్షాళనలో బండి సంజయ్ పదవి ఉంటుందా ఊడుతుందా? అలాగే బొగ్గు, గనులశాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పదవి సేఫ్ గానే ఉందా? లేదా? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

