Ashwini Vaishnaw: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై, అత్యధిక కాలం దేశ ప్రధానిగా సేవలందించిన నేతగా నరేంద్ర మోదీ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.
ఈ క్రమంలో స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘకాలపు రికార్డును మోదీ అధిగమించారు. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డు బద్దలు
2014 మే 26న దేశ ప్రధానిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ, నాటి నుంచి నేటి (2026 జూన్ 10) వరకు విజయవంతంగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. గతంలో ఈ అరుదైన రికార్డు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉండేది. 1952లో దేశంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 1964 మే 27న ఆయన కన్నుమూసే వరకు.. నెహ్రూ ఎన్నికైన ప్రధానిగా 4,398 రోజుల పాటు పదవిలో కొనసాగారు. 2014, 2019, మరియు 2024 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఘన విజయం సాధించడం ద్వారా పీఎం మోదీ ఈ చారిత్రాత్మక మైలురాయిని సొంతం చేసుకున్నారు.
Read also: Stock market: బుధవారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Ashwini Vaishnaw: దేశ స్థిరత్వానికి నిదర్శనం: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్
ఈ అద్భుత సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ఢిల్లీలోని లోధి రోడ్డులో ఉన్న ప్రసిద్ధ ఆలయాన్ని సందర్శించి, దేశం మరింత పురోగమించాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
“ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు, క్లిష్ట పరిస్థితులు నెలకొన్న తరుణంలో.. భారతదేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన, స్థిరమైన నాయకత్వం లభించడం దేశప్రజలందరికీ గర్వకారణం.”
భవిష్యత్తులో కూడా ప్రధానమంత్రి మోదీ ఇదే అంకితభావం, నిబద్ధతతో దేశాన్ని నడిపిస్తారని, 'వికసిత్ భారత్' స్వప్నాన్ని సాకారం చేస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య భారతంలో అత్యధిక కాలం సేవలు అందించిన ప్రధానిగా మోదీ నిలవడం దేశ ప్రజాస్వామ్య పరిణతికి నిదర్శనమని ఆయన కొనియాడారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:
పీవోకేలో ఘోర ప్రమాదం.. పాక్ ఆర్మీ MI-17 హెలికాప్టర్ కూలి 21 మంది మృతి

