భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటన దేశీయంగా సరికొత్త రాజకీయ వివాదానికి దారితీసింది. పర్యటనలో భాగంగా ఓస్లోలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసిన తర్వాత..
ప్రధాని మోదీ అంతర్జాతీయ విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోవడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విదేశీ గడ్డపై భారత ప్రధాని ప్రవర్తించిన తీరు దేశ ప్రతిష్టను మసకబార్చేలా ఉందంటూ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ఇది పరాకాష్ట అని విమర్శించారు.
Read Also : సర్వే సామాజిక న్యాయానికి బలమైన పునాది

నార్వే జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న.. సమాధానం దాటవేసిన పీఎం
అసలు ఈ వివాదానికి కారణం నార్వేకు చెందిన ఒక ప్రముఖ అంతర్జాతీయ మహిళా విలేకరి అడిగిన ప్రశ్న. ప్రపంచ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ (పత్రికా స్వేచ్ఛ సూచీ) లో నార్వే ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సదరు విలేకరి ప్రధాని మోదీని.. “ప్రపంచంలోనే అత్యుత్తమ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశ మీడియా నుంచి ప్రశ్నలు ఎదుర్కొనేందుకు మీరెందుకు భయపడుతున్నారు?” అని నేరుగా ప్రశ్నించారు. అయితే, ప్రధాని మోదీ ఆమె ప్రశ్నకు బదులివ్వకుండా సమాధానాన్ని దాటవేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. సదరు మహిళా జర్నలిస్ట్ ఈ పూర్తి ఉదంతానికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అది కాస్తా ప్రపంచవ్యాప్తంగా నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రశ్నలకు భయపడి పారిపోతే దేశ పరువు ఏం కావాలి?: రాహుల్ గాంధీ
నార్వే జర్నలిస్ట్ పోస్ట్ చేసిన ఈ వీడియోను రాహుల్ గాంధీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ప్రధాని మోదీపై విమర్శల వర్షం కురిపించారు. “ఏ విషయాల్లోనైనా దాపరికాలు, తప్పులు లేనప్పుడే మనిషిలో ధైర్యం ఉంటుంది. కానీ ఇలా విదేశీ మీడియా అడిగే ప్రాథమిక ప్రశ్నలకు కూడా భయపడి ప్రధానమంత్రి పారిపోతే.. అంతర్జాతీయ సమాజంలో మన దేశ పరువు ఏం కావాలి?” అని రాహుల్ గాంధీ నిలదీశారు. ప్రధాని మోదీ గత పదేళ్లుగా భారతదేశంలో కూడా ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదని, ఇప్పుడు విదేశాల్లోనూ అదే నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా విమర్శిస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

