Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మొగల్తూరులో చంద్రబాబు పర్యటన.. మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణం

మొగల్తూరులో చంద్రబాబు పర్యటన.. మత్స్యకారులతో కలిసి పడవలో ప్రయాణం

వార్త 2 weeks ago

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి స్వగ్రామమైన నర్సాపురం నియోజకవర్గ పరిధిలోని మొగల్తూరులో ఆయన పర్యటన అత్యంత ఆసక్తికరంగా సాగింది.

‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా అక్కడకు చేరుకున్న ఆయన, స్థానిక ప్రజలతో మమేకమయ్యారు.

మత్స్యకారులతో ముచ్చటించి, పింఛన్ల పంపిణీ

పర్యటనలో భాగంగా ఫెర్రీ పాయింట్‌కు చేరుకున్న సీఎం చంద్రబాబు, అక్కడ ఉన్న మత్స్యకారులతో ఆప్యాయంగా మాట్లాడారు. తిరుమని స్వామి అనే స్థానిక మత్స్యకారుడికి తన చేతుల మీదుగా పింఛను అందజేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేశారు.

Chandrababu Naidu: ఆప్యాయంగా ఆహ్వానించి పడవ ప్రయాణం

సీఎంతో ముచ్చటించే సమయంలో ఒక మత్స్యకారుడు తమ పడవలోకి రావాలని ఆయనను ఆప్యాయంగా కోరారు. ఆ ఆహ్వానాన్ని చిరునవ్వుతో స్వీకరించిన చంద్రబాబు, వెంటనే పడవ ఎక్కి వారితో కలిసి కాసేపు జలవిహారం చేశారు. సముద్రంలో వారి జీవన విధానం, వేటకు వెళ్లే సమయంలో ఎదురయ్యే సవాళ్లు, భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.

మత్స్యకారుల భద్రతకు ప్రభుత్వ భరోసా

ఈ ప్రయాణంలో సముద్రంలో వేటకు వెళ్లినప్పుడు మత్స్యకారులు గల్లంతవుతున్న ఘటనలపై చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సుమారు ఇరవై రోజులు సముద్రంలో చిక్కుకుపోతే, కోస్ట్ గార్డ్ మరియు నేవీ సహకారంతో వారిని ఎలా రక్షించింది ఆయన గుర్తుచేశారు. మత్స్యకారుల భద్రతకే తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు.

Epaper: epaper.vaartha.com

నిలిచిన పోస్టల్ సేవలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha