Dailyhunt
మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు

మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు

వార్త 1 week ago

Monalisa Controversy: కుంభమేళాలో పూసలు అమ్ముతూ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన రాజస్థానీ యువతి మోనాలిసా వివాదంలో సరికొత్త మలుపు తిరిగింది. తన ఫేస్‌బుక్ ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె పెళ్లి చేసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

అయితే, ఈ పెళ్లి చట్టవిరుద్ధమని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) జరిపిన విచారణలో తేలింది.

Read Also: Mullugummi Waterfall Accident: సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలు తీసింది!

 POCSO case registered against Monalisa’s husband

మోనాలిసా మైనర్ అని గుర్తింపు

నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి సమయానికి మోనాలిసా వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలలు మాత్రమేనని కమిషన్ నిర్ధారించింది. మైనర్ కావడంతో ఈ వివాహం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. గతంలో మోనాలిసా స్వయంగా తాను మేజర్ అని చెప్పుకున్నప్పటికీ, ఆధార్ మరియు ఇతర పత్రాల ఆధారంగా ఆమె మైనర్ అని తేలింది.

Monalisa Controversy: ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

మోనాలిసా మైనర్ అని తేలడంతో, మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదైంది. మైనర్ అమ్మాయిని ప్రలోభపెట్టి పెళ్లి చేసుకోవడం, కిడ్నాప్ వంటి అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. కేరళలోని తిరువనంతపురంలో వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే?

రాజస్థాన్‌కు చెందిన మోనాలిసా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఉండగా, ఒక ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలతో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ ద్వారా ఫర్మాన్ ఖాన్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే, ఆమె మైనర్ కావడంతో ఇప్పుడు ఫర్మాన్ ఖాన్ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గంజాయి మత్తులో దారుణం.. యువతిపై గ్యాంగ్ రేప్, ఆపై హత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha