Dailyhunt
Movie: ఓటీటీకి వచ్చేసిన 'ఈషా' హారర్ థ్రిల్లర్

Movie: ఓటీటీకి వచ్చేసిన 'ఈషా' హారర్ థ్రిల్లర్

వార్త 1 month ago

Movie: చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను బాగానే భయపెట్టింది. అందుకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.

ఐఎమ్ డీబీలోనూ 9.3 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి వచ్చేసింది. హారర్ థ్రిల్లర్ సినిమాగా 'ఈషా' (Eesha) కనిపిస్తుంది. శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించిన సినిమా ఇది.

డిసెంబర్ 12వ తేదీన విడుదలైన ఈ సినిమాలో త్రిగుణ్ హెబ్బా పటేల్ అఖిల్ రాజ్ సిరి హనుమంతు ప్రధానమైన పాత్రలను పోషించారు. థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబట్టిన ఈ సినిమా, రీసెంటుగా అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఓ మాదిరి కంటెంట్ తో ఈ సినిమాను రూపొంది ఉండొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలక్రిందులు చేస్తూ ఈ సినిమా భయపెట్టగలిగింది.

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన నలుగురు స్నేహితులు, దెయ్యాలు - ప్రేతాత్మలు లేవని బలంగా నమ్ముతూ ఉంటారు. దెయ్యాల పేరుతో భయపెడుతున్న దొంగ స్వామీజీలను పట్టుకుని, తమ నమ్మకాన్ని వెలుగులోకి తెస్తూ ఉంటారు. అలా ఆదిదేవ్ అనే ఒక స్వామీజీని కూడా పట్టించాలనే ఉద్దేశంతో, ఆంధ్ర - ఒడిశా బోర్డర్ కి ఈ నలువురు ఫ్రెండ్స్ బయల్దేరతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది మిగిలిన కథ.

Read hindi news: hindi.vaartha.com

Allu Arjun Charge Sheet Rejection: సంధ్య థియేటర్ ఛార్జ్‌షీట్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha