Dailyhunt
Movie Posters: న్యూ ఇయర్.. టాలీవుడ్ కొత్త పోస్టర్‌లు విడుదల

Movie Posters: న్యూ ఇయర్.. టాలీవుడ్ కొత్త పోస్టర్‌లు విడుదల

వార్త 3 months ago

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ఒకవైపు కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతూనే, మరోవైపు సంక్రాంతి పండుగ రేసులో నిలిచే భారీ సినిమాల అప్‌డేట్స్‌తో చిత్ర పరిశ్రమ మొత్తం సందడిగా మారింది.అయితే కొత్త ఏడాది సందర్భంగా..

2026లో వచ్చే సినిమాలకు సంబంధించి కొత్త పోస్టర్‌లతో ఆనందాన్ని నింపారు మేకర్స్‌. పలు నిర్మాణ సంస్థలు ఆయా సినిమాలకు సంబంధించిన పోస్టర్‌ (Movie Posters) లను రిలీజ్‌ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ తెలుపుతున్నాయి.

Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' ఫస్ట్ లుక్ చూసారా?

'స్పిరిట్'

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్‌ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఒక పోలీసాఫీసర్ గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా త్రిప్తి దిమ్రి హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. 2026 న్యూ ఇయర కానుకగా తాజాగా ఫస్ట్ పోస్టర్ (Movie Posters)ను విడుదల చేశారు.

విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న 'జననాయగన్' చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, మమిత బైజు కీలక పాత్రలో కనిపించనుంది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ (Vijay) ను ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూపించబోతున్నారని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. నూతన సంవత్సరం సందర్బంగా పోస్టర్ ను విడుదల చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Pawan Kalyan: సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో పవన్‌ కొత్త సినిమా ప్రకటన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha