Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూడో భార్య కోసం అమీర్ రూ.100 కోట్లతో కొత్త ఇల్లు ?

మూడో భార్య కోసం అమీర్ రూ.100 కోట్లతో కొత్త ఇల్లు ?

వార్త 3 weeks ago

Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితం గురించి బీ-టౌన్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. 61 ఏళ్ల వయసులో ఆయన మూడో వివాహం చేసుకున్నారనే వార్తల నేపథ్యంలో, తన కొత్త కుటుంబం కోసం ముంబైలో అత్యంత ఖరీదైన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు బాలీవుడ్ సమాచారం.

ముంబైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పాలిహిల్ ప్రాంతంలో సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి అమీర్ రెండు లగ్జరీ అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆ నిర్మాణాల స్థానంలో ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో కూడిన ఒక భారీ, విశాలమైన విల్లాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

అందరూ ఒకే చోట ఉండేలా మెగా ప్లాన్: బాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ

ఈ కొత్త లగ్జరీ ఇల్లు కేవలం కొత్త భార్య కోసమే కాకుండా, తన కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండేలా అమీర్ ఖాన్ డిజైన్ చేయిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత భార్య గౌరీ స్పాట్, మాజీ భార్య కిరణ్ రావుతో పాటు పిల్లలు, తల్లి, సోదరీమణులు అందరూ ఒకే ఆవరణలో, ఒకే చోట కలిసి ఉండేలా ఈ మెగా ప్రాజెక్టును ప్లాన్ చేస్తున్నారట. గతంలో విడిపోయినప్పటికీ మాజీ భార్యలతో సత్సంబంధాలు కొనసాగించే అమీర్, ఇప్పుడు అందరినీ ఒకే గూటికి చేర్చేందుకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఆపరేషన్ తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో చూడండి !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha