India vs West Indies: వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. మైదానంలో అనూహ్య ఓటమితో పాటు, మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారీ షాక్ ఇచ్చింది.
ముల్లాన్‌పూర్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని భారత్ చేజార్చుకోవడమే కాకుండా, స్లో ఓవర్ రేట్ నిబంధనల ఉల్లంఘన కింద జరిమానాను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత ఓవర్లలో 352 పరుగుల భారీ స్కోరు సాధించి వెస్టిండీస్ ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచింది. అయితే విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో మరొక 10 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి రెండు వన్డేలు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, ఆఖరి పోరులో ఓడిపోవడంతో 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.
Asian Games 2026: జపాన్‌లో ముగిసిన ఆసియా క్రీడల సంబరం
ICC fines India and West Indies teams for the third ODI.
India vs West Indies: స్లో ఓవర్ రేట్‌తో ఐసీసీ కఠిన చర్యలు
ఓటమి బాధలో ఉన్న ఇరు జట్లకు మ్యాచ్ ముగిసిన వెంటనే ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. గ్రౌండ్లో నిర్ణీత సమయానికి ఓవర్లు పూర్తి చేయనందుకు గాను భారత జట్టుకు మ్యాచ్ ఫీజులో 20 శాతం, వెస్టిండీస్ జట్టుకు 10 శాతం ఫైన్ విధించింది. మ్యాచ్ సమయానికి సంబంధించి అంపైర్లు కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ, భారత్ కనీస సమయం కంటే 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడినట్లు గుర్తించారు. దాంతో ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ మ్యాచ్ రెఫరీ ప్రకాష్ భట్ ఈ జరిమానాలను అమలు చేశారు.
ఐసీసీ ఆర్టికల్ 2.22 ప్రకారం ఫైన్ వివరాలు
ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా వేసే ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం కోత విధిస్తారు. ఈ నిబంధనల ప్రకారమే 4 ఓవర్లు ఆలస్యమైనందున భారత్‌పై 20 శాతం, 2 ఓవర్లకు విండీస్‌పై 10 శాతం చొప్పున పెనాల్టీ పడింది. ఫీల్డ్ అంపైర్లు జయరామన్ మదన్ గోపాల్, సామ్ నోగాజ్స్కీలతో పాటు థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, ఫోర్త్ అంపైర్ వీరేందర్ శర్మలు ఈ స్లో ఓవర్ రేట్‌పై ఫిర్యాదు చేశారు. ఇరు జట్ల కెప్టెన్లు తమ తప్పును అంగీకరించడంతో ఎలాంటి విచారణ లేకుండానే కేసు ముగిసింది.
Epaper: epaper.vaartha.com

