Bellamkonda Sai Sreenivas Marriage: టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్యా రెడ్డితో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.బుధవారం (ఏప్రిల్ 29) రాత్రి సరిగ్గా 11.05 గంటలకు కావ్యా రెడ్డి మెడలో సాయి శ్రీనివాస్ మూడు ముళ్లు వేశారు.తిరుమలలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వీరి వివాహం అత్యంత ఘనంగా జరిగింది.
Read Also:Michael : ఇనార్బిట్ మాల్ లో 'మైఖేల్' చిత్ర ప్రత్యేక ప్రదర్శన
Bellamkonda Sai Sreenivas Marriage: హాజరైన ప్రముఖులు
ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కావ్య రెడ్డి ఒక ప్రముఖ న్యాయవాది కుమార్తె. వీరి బంధం మార్చిలో జరిగిన ‘రోకా’ వేడుకతో అధికారికం కాగా, ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో నిశ్చితార్థం, అనంతరం ఏప్రిల్ 27న పెళ్లికొడుకు ఫంక్షన్ ఘనంగా నిర్వహించారు. మే 1 హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్‌కి ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
అల్లు అర్జున్ 'రాకా' కు భారీ డిమాండ్

