Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మూలపేట పోర్టు జగనన్న సంకల్పం!

మూలపేట పోర్టు జగనన్న సంకల్పం!

వార్త 2 months ago

Mana Mulapeta ku Podam: రాష్ట్రంలో వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న మూలపేట పోర్టు పనులను కూటమి ప్రభుత్వం అడ్డుకోవడంతో వైయస్ఆర్‌సీపీ ఉద్యమబాట పట్టింది.

ఈ మేరకు సోమవారం వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన 'మన మూలపేటకు పోదాం' కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రజలు, వైయస్ఆర్‌సీపీ శ్రేణులు కదం తొక్కి పోర్టు వద్దకు తరలివచ్చారు. ప్రభుత్వ ఆంక్షలు, పోలీసుల అడ్డంకులు ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి తమ నిరసనను తెలియజేశాయి.

Read Also: Cycle : రూ.35 వేల సైకిల్ కేవలం రూ.24 వేలకే.. చంద్రబాబు సర్కార్ బంపర్ ఆఫర్!

శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి వైయస్ జగన్ శ్రీకారం

2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించి, సంతబొమ్మాళి మండలం మూలపేట తీరంలో సుమారు రూ.4,361.91 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2023 ఏప్రిల్ 19న శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్ట్‌లో మూలపేట, విష్ణుచక్రం గ్రామాలకు చెందిన 596 కుటుంబాలకు పునరావాసం కోసం రూ.149 కోట్లు ఖర్చు చేశారు. టెక్కలి జాతీయ రహదారి నుంచి పోర్టు వరకు రోడ్డు కోసం 327.75 ఎకరాలు, రైల్వే మార్గం కోసం 100.71 ఎకరాలు సేకరించారు.

Mana Mulapeta ku Podam: వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 70 శాతం పనులు పూర్తి

వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలోనే పోర్టు పనుల్లో సుమారు 70 శాతం పూర్తి అయ్యాయి. అయితే తరువాత వచ్చిన కూటమి ప్రభుత్వంలో మిగిలిన పనులు నిలిచిపోయాయి. క్రెడిట్ కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మళ్లీ భూములు అవసరమంటూ అధికారుల ప్రకటనలతో రైతుల్లోఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు తీరుకు నిరసనగా వైయస్సార్సీపీ మన మూలపేట కు పోదాం కార్యక్రమం పిలుపునిచింది.

 YSRCP leaders and activists protesting at Mulapeta Port in Srikakulam district

భారీ పోలీస్ బందోబస్తు.. అడ్డంకులు

'మన మూలపేటకు పోదాం' కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నౌపాడ జంక్షన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ముల్లకంచెలతో కేట్లు ఏర్పాటు చేసి, మూలపేటకు వచ్చే ప్రధాన రహదారులను బ్లాక్ చేశారు. పోర్టు రోడ్డును టిప్పర్లతో మూసివేసి నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అరెస్టులకు సిద్ధమయ్యారు. అయినప్పటికీ వైయస్ఆర్‌సీపీ శ్రేణులు వెనుకడుగు వేయకుండా పెద్దఎత్తున తరలివచ్చాయి.

ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పలువురు నాయకులు పాల్గొన్నారు. వైయస్ఆర్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ బూడి ముత్యాల నాయుడు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీలు కుంభ రవిబాబు, వరుదు కళ్యాణి, పేరాడ తిలక్, కేకే రాజు తదితరులు హాజరయ్యారు. సంతబొమ్మాళి మండలం నౌపడ మూడు రోడ్లు జంక్షన్ వద్ద సోమవారం నిర్వహించిన భారీ సభలో రాష్ట్రంలో ఉన్న కూటం ప్రభుత్వంపై రాష్ట్ర మాజీ మత్రులు, మాజీ స్పీకర్ దుమ్మెత్తి పోసారు.. ఈ సందర్భంగా మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణ దాస్, ధర్మాన ప్రసాదరావు, సిదరి అప్పలరాజు, పుష్పవాణి లు మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం హయాంలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదని రాజధానిపైనే అందరి దృష్టి ఉందని, ఇసుక నుంచి ఊక, చివరకు పేడ సైతం దోచుకునేందుకు అవధులు లేవని అన్నారు. మూలపేట పోర్టు ఈ జిల్లాకి కాకుండా రాష్ట్రానికి తలమానికమని అటువంటి పోర్టును మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మాణానికి కంకణం కట్టుకొని 70 శాతం పనులు పూర్తి చేశారన్నారు. ఈ జిల్లాకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు పోర్టు నిర్మాణం మేమే, మా హయాంలోని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తున్నారని అన్నారు. ఈ పోర్టుతో పాటు పలాస కిడ్నీ ఆసుపత్రి, భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు ఎన్నో ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి హయాంలోని మంజూరయ్యాయని వారు చెప్పారు. ఆ నాయకులకు బుద్ధి చెప్పాలంటే ప్రజల్లో తిరుగుబాటు రావాలని వారు అన్నారు. పోర్టు నిర్మాణం జరిగితే కూటమి ప్రభుత్వం అన్న ఉద్దేశంతో వారికి సెటిల్మెంట్లు కాకపోవడం వలన పనులు జరగకుండా ఆపేస్తున్నారని వారు ఆరోపించారు. కింజరాపు కుటుంబం 40 సంవత్సరాలు పరిపాలనలో ఈ జిల్లాకు ఏమి చేసిందని వారు ప్రశ్నించారు. భావనపాడు ఫిషింగ్ హార్బర్ తో పాటు ఎక్కడ ఎటువంటి ప్రాజెక్తులు ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారని వారు ఆరోపించారు. టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పేడాడ తిలక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, జడ్పిటిసి పాల వసంత రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బుడ్డా మోహన్ రెడ్డి, నౌపడ పంచాయతీ సర్పంచ్ పిలక బృందారవికుమార్ రెడ్డి, వైయస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha