Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ములుగులో సీతక్క బర్త్‌డే వేడుకలు.. గట్టమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

ములుగులో సీతక్క బర్త్‌డే వేడుకలు.. గట్టమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు

వార్త 1 month ago

Minister Seethakka birthday: తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జన్మదిన వేడుకలు ములుగు జిల్లాలో అత్యంత వైభవంగా జరిగాయి.

తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి సీతక్క ములుగులోని ప్రసిద్ధ గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గట్టమ్మ ఆలయం నుండి ములుగులోని లీలా గార్డెన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి స్వయంగా పాల్గొన్నారు.

Read Also : Minor Driving Rules: మైనర్లు వాహనం నడిపితే భారీ మూల్యం.. 25ఏళ్ల వరకు నో లైసెన్స్

 Seethakka’s birthday celebrations in Mulugu; special prayers at Gattamma Temple.

Minister Seethakka birthday: జాతీయ రహదారిపై కాంగ్రెస్ శ్రేణుల కోలాహలం

మంత్రి సీతక్క జన్మదినాన్ని పురస్కరించుకుని 163 జాతీయ రహదారి (NH-163) అంతటా పండుగ వాతావరణం నెలకొంది. హైవే పొడవునా సీతక్క భారీ ఫ్లెక్సీలు, కాంగ్రెస్ పార్టీ జెండాలతో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు. జాతీయ రహదారిపై మంత్రికి ఘన స్వాగతం పలుకుతూ, శ్రేణులు నినాదాలు చేస్తూ తమ అభిమాన నాయకురాలికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్, ఎస్పీ

మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఉన్నతాధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మంత్రి సీతక్కకు పూల బొకేలు అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సిహెచ్ మహేందర్ జి, డిఎస్పీ రవీందర్ తదితర అధికారులు కూడా పాల్గొని మంత్రికి అభినందనలు తెలిపారు.

TGSRTC గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha