Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబై ఆసుపత్రికి పవన్ కళ్యాణ్.. రెండు భుజాలకు చికిత్స?

ముంబై ఆసుపత్రికి పవన్ కళ్యాణ్.. రెండు భుజాలకు చికిత్స?

వార్త 1 month ago

Pawan kalyan shoulder injury:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై చికిత్స కోసం శుక్రవారం పయనమవుతున్నారు. గత కొంతకాలంగా ఆయన రెండు భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారు.

రొటేటర్ కఫ్ గాయం వల్ల భుజాల కండరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని సమాచారం. నిరంతర ప్రజాసేవలో బిజీగా ఉండటం వల్ల చికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు వైద్యుల సూచన మేరకు ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్తున్నారు.

Read also: Thalliki Vandanam Scheme: జూలై 15న తల్లికి వందనం.. ఈ తప్పు చేస్తే డబ్బులు రావు!

 Pawan Kalyan undergoing treatment in Mumbai

ఆసుపత్రిలో పరీక్షలు పూర్తి

ఇటీవల ముంబై ఆసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో భుజాల గాయం తీవ్రతపై స్పష్టత రావడంతో వైద్యులు చికిత్స అవసరమని చెప్పారు. నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే చికిత్స తీసుకోవాలని సూచించారు. ఆ సమయం నుండి పవన్ తన షెడ్యూల్స్ అన్నింటినీ సర్దుబాటు చేసుకున్నారు. ఇప్పుడు నిర్ణీత సమయానికి వైద్యం కోసం సిద్ధమయ్యారు.

Pawan kalyan shoulder injury:చికిత్స తర్వాత విశ్రాంతి

ముంబై పర్యటన ముగించుకుని తిరిగొచ్చాక ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నారు. భుజాల నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు డాక్టర్లు చిన్నపాటి ప్రక్రియ చేయనున్నారు. గాయం త్వరగా నయమై, మళ్లీ పూర్వస్థితికి చేరుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆయన టీమ్ ఎప్పటికప్పుడు గమనిస్తోంది. త్వరలోనే ఆయన తిరిగి తన అధికారిక పనుల్లో పాల్గొంటారు.

Epaper: epaper.vaartha.com

తిరుపతిలో దారుణం.. మేస్త్రిని ఇటుకలతో కొట్టి చంపిన దుండగులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha