Dailyhunt

Mumbai: చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

వార్త 1 month ago
Mumbai: చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్ నలుగురికి గాయాలు

దేశ ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) నగరంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ముల్లుంద్‌ వెస్ట్‌లో నిర్మాణంలో ఉన్న మెట్రో స్టేషన్‌ పిల్లర్ ఒక్కసారిగా కూలిపోయింది.

ఈ ప్రమాదంలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై వెళ్తున్న వాహనాల మీద పిల్లర్‌ కూలడంతో ఆటోలో వెళ్తున్న నలుగురికి ప్రయాణికులు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఘటనాస్థలంలో క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘోర ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతున్నాయి, వాటి ద్వారా ప్రమాద తీవ్రత స్పష్టంగా తెలుస్తోంది. (Mumbai) అధికారులు ఘటనపై గహన విచారణ ప్రారంభించి, భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు ఎదురవకుండా నిర్మాణ ప్రామాణికతలను పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Digital India: కొత్త భద్రతా ఫీచర్లతో రానున్న ఆధార్ కార్డులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha