Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు

Municipal Election Results: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు

వార్త 4 months ago

తెలంగాణ (TG) రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల (Municipal Election Results) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యాహ్నం 2:25 గంటల వరకు బీఆర్​ఎస్​ పార్టీ అభ్యర్థులు 636కు పైగా వార్డుల్లో విజయం సాధించారు.

గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారులు వెంటనే ధ్రువపత్రాలను అందజేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. (Municipal Election Results) కౌంటింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కౌంటింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల దూరం వరకు ఆంక్షలు విధించారు.

దూసుకెళ్తున్న కారు

  • సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • గడ్డపోతారం : 18 వార్డుల్లో 14 వార్డులు గెలుచుకున్న బీఆర్‌ఎస్‌
  • గడ్డపోతారం : బీఆర్‌ఎస్‌-14, కాంగ్రెస్‌-3, ఇతరులు-1
  • జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కైవసం
  • అయిజ: 20 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 13, కాంగ్రెస్‌ 7
  • యాదాద్రి: పోచంపల్లి 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చక్రపాణి విజయం
  • నల్గొండ: దేవరకొండ 13 వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి భవాని విజయం
  • రంగారెడ్డి జిల్లా అలియాబాద్ 16వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వనజ విజయం
  • రంగారెడ్డి జిల్లా అలియాబాద్ 19వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం
  • మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట 10వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్థి శ్రీలత విజయం
  • మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట 16వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్థి సురేశ్‌రెడ్డి విజయం
  • ఇబ్రహీంపట్నం: 12వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ్రు త్రిలోక్‌ విజయం
  • ఇబ్రహీంపట్నం: 11వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొండ్రు శ్రీలత విజయం
  • అలియాబాద్: 19వ వార్డులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం
  • ఎల్లంపేట: 16వ వార్డులో బీఆర్ఎస్‌ అభ్యర్థి సురేశ్‌రెడ్డి విజయం
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha