Murasu cyclone:మురసు తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో దాని ప్రభావం ఇంకా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల హెచ్చరికలు జారీ చేసింది.
తుఫాను తీవ్రత దృష్ట్యా అధికారులు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
Bhadradri Kothagudem heavy rains: కొత్తగూడెంలో ఉప్పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
Impact of Cyclone Murasu on the Telugu states
ఆంధ్రప్రదేశ్ వాతావరణ హెచ్చరికలు
వారం వ్యవధిలోనే వరుస తుఫాన్లు తాకడంతో ఏపీ అతలాకుతలమవుతోంది. మురసు తుఫాను ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గకపోవడంతో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి.
- రెడ్ అలర్ట్ (తీవ్ర భారీ వర్షాలు): అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలు.
- ఆరెంజ్ అలర్ట్ (భారీ వర్షాలు): అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు.
- ఎల్లో అలర్ట్: మిగిలిన జిల్లాలన్నింటికీ ఎల్లో అలర్ట్ జారీ చేయడమైంది.
వరుస తుఫాన్ల ధాటికి చేతికి వచ్చిన పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
Murasu cyclone:తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరికలు
తెలంగాణలోనూ మురసు తుఫాను తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వర్షాల కారణంగా జలమయమైంది.
- రెడ్ అలర్ట్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
- ఆరెంజ్ అలర్ట్: ఖమ్మం జిల్లా. ఈ రెండు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తూ, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఖమ్మం, కొత్తగూడెం కలెక్టరేట్లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే ఇతర జిల్లాలు
ములుగు, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
ప్రజలకు అధికారుల సూచనలు
తుఫాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికారులు జారీ చేస్తున్న సూచనలను ప్రజలందరూ విధిగా పాటించాలని కోరారు.
Epaper: epaper.vaartha.com
మురసు తుపాను.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వర్షాలు..విద్యాసంస్థలకు సెలవు

