Shamita Shetty Comments: గ్లామర్ ఇండస్ట్రీలో హీరోయిన్ల వయస్సుపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడం కొత్తేమీ కాదు. తాజాగా నటి షమితా శెట్టిని టార్గెట్ చేస్తూ ఒక నెటిజన్..
“మీ వయస్సు పెరిగిపోయింది, ముసలితనం వచ్చేస్తోంది.. ఇప్పటికైనా పెళ్లి చేసుకోవచ్చు కదా” అంటూ నెగెటివ్ కామెంట్ చేశాడు. దీనిపై షమితా ఏమాత్రం తగ్గకుండా, అత్యంత హుందాగా మరియు అంతే ఘాటుగా సమాధానమిచ్చి ట్రోలర్ల నోళ్లు మూయించారు.
Shamita Shetty Comments: ఏదీ శాశ్వతం కాదు.. నేను ఫిట్‌గా ఉన్నా
Shamita Shetty Hits Back At Troll Over Age-Shaming And Marriage Comments On Social Media
వయస్సుపై వచ్చిన కామెంట్‌కు షమితా శెట్టి స్పందిస్తూ.. “అవును, నా వయస్సు పెరిగింది, దాంతో పాటు నాలో మార్పులు వస్తాయి. కాలంతో పాటు ప్రకృతిలో ప్రతిదీ మారుతుంది. శారీరక రూపురేఖలతో సహా ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ, నా వయసుకు తగ్గట్లుగా నేను చాలా ఆరోగ్యంగా, ఫుల్ ఫిట్‌గా, మానసికంగా ఎంతో సంతోషంగా ఉన్నాను. అది నాకు చాలు” అని స్పష్టం చేశారు.
పెళ్లి చేసుకొని మీరేం సాధించారు?
ఇక పెళ్లి కాలేదంటూ చేసిన వెటకారపు వ్యాఖ్యలపై ఆమె మరింత తీవ్రంగా స్పందించారు. “పెళ్లి చేసుకొని మీరేం సాధించారు? అంతగా పెళ్లయి సెటిల్ అయ్యామనుకునే మీరు.. నాలాంటి సింగిల్స్‌ను సోషల్ మీడియాలో ఎందుకు ఫాలో అవుతున్నారు? మా జీవితాలపై మీకెందుకు అంత ఆరాటం?” అంటూ స్ట్రెయిట్ క్వశ్చన్‌తో నెటిజన్‌ను కడిగిపారేశారు. మహిళల వ్యక్తిగత జీవితాలను, వారి వయస్సును గౌరవించడం నేర్చుకోవాలంటూ ఆమె ఇచ్చిన రిప్లైకు ప్రస్తుతం నెటిజన్ల నుండి, ముఖ్యంగా మహిళా అభిమానుల నుండి భారీ మద్దతు లభిస్తోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు

