Dailyhunt
"నా ఆరోగ్యం నిలకడగా ఉంది".. శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ తొలి ట్వీట్

"నా ఆరోగ్యం నిలకడగా ఉంది".. శస్త్రచికిత్స తర్వాత పవన్ కళ్యాణ్ తొలి ట్వీట్

వార్త 6 days ago

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితిపై కీలక ప్రకటన చేశారు. శనివారం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం తాను క్రమంగా కోలుకుంటున్నానని ఆయన వెల్లడించారు.

Read Also:Chandrababu Naidu Birthday: బాబు పుట్టినరోజు సందర్భంగా భువనేశ్వరి భారీ విరాళం

Pawan Kalyan: సైనసైటిస్ సమస్యకు పరిష్కారం

గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సైనసైటిస్ (Sinusitis) సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. దీనివల్ల ఆయన పాలనాపరమైన విధుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యక్తిగత వైద్యుల సలహా మేరకు శనివారం శస్త్రచికిత్స నిర్వహించగా, అది సక్సెస్ అయిందని వైద్య బృందం తెలిపింది.

సర్జరీ విజయవంతమైన నేపథ్యంలో తన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆకాంక్షించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులతో పాటు యావత్ ప్రజానీకానికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పలువురు నేతల ట్వీట్లకు స్పందిస్తూ, తన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha