Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాగ్‌పూర్‌లో ఘోరం.. ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం

నాగ్‌పూర్‌లో ఘోరం.. ఐఏఎఫ్ అధికారి భార్యపై అఘాయిత్యం

వార్త 2 weeks ago

Maharashtra crime: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. భారతీయ వైమానిక దళ (IAF) అధికారి భార్య అయిన 24 ఏళ్ల యువతిపై ఒక ముఠా దారుణానికి ఒడిగట్టింది.

బాధితురాలి పాత స్కూల్ స్నేహితుడు, అతడి అనుచరులు కలిసి ఆమెకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా, ఆ దృశ్యాలను రహస్యంగా వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ లక్షల రూపాయలు వసూలు చేశారు. చివరికి ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసి, నిఖా (పెళ్లి) జరిపించినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడైన మౌలానా కోసం గాలిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే బాధితురాలు, భూమి లావాదేవీల విషయమై మాట్లాడేందుకు తన పాత స్కూల్ పరిచయస్తుడైన అయ్యాజ్ తాజ్ మదారేను కలిసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిబ్రవరి 8న ఒక హోటల్‌లో జరిగిన సమావేశంలో అయ్యాజ్ ఆమెకు ఇచ్చిన పానీయంలో మత్తుమందు కలిపాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ దారుణ దృశ్యాలను రహస్యంగా రికార్డ్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ గత కొన్ని నెలలుగా ఆమె నుంచి దాదాపు రూ. 4 లక్షలు వసూలు చేశాడు. అంతేకాకుండా, లొంగిపోకపోతే చేతబడి చేస్తామంటూ పలుమార్లు భయభ్రాంతులకు గురిచేశారు.

Read Also : Chittoor incident: పుంగనూరులో వజ్రాల కోసం గణేష్ విగ్రహం ధ్వంసం

 Horrific incident in Nagpur: IAF officer’s wife sexually assaulted.

Maharashtra crime: బలవంతపు మతమార్పిడి.. నిఖా

మే 31న నిందితుడు అయ్యాజ్, అతడి అనుచరుడు అమీన్ షేక్ కలిసి ఆ యువతిని కల్మేశ్వర్ ప్రాంతానికి బలవంతంగా తీసుకెళ్లారు. అక్కడ హజ్రత్ మౌలానా అనే మత పెద్ద సమక్షంలో ఆమె చేత బలవంతంగా మతమార్పిడి ఆచారాలు చేయించారు. అనంతరం ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా, బెదిరించి అయ్యాజ్‌తో నిఖా జరిపించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. నగరం వెలుపల భారతీయ వైమానిక దళంలో విధులు నిర్వహిస్తున్న ఆమె భర్తకు ఈ ఘోరం గురించి తెలియడంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

భర్త ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన నిజాలు

జూన్ 14న బాధితురాలి భర్త నాగ్‌పూర్ పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తక్షణమే స్పందించి ప్రధాన నిందితుడు అయ్యాజ్ తాజ్ మదారే, అతడి అనుచరుడు అమీన్ షేక్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మౌలానా కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగ్‌పూర్ వ్యాప్తంగా ప్రజలు, పలు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇన్‌స్టాగ్రామ్‌లో సంచిత ఉగాలే చివరి వీడియో.. అంతలోనే ఏం జరిగింది?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha