Vinesh Phogat: భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫోగాట్ ఒక వీడియో సందేశం ద్వారా దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే విషయాలను పంచుకున్నారు. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ కోర్టులో ఫిర్యాదు చేసిన ఆరుగురు మహిళా రెజ్లర్లలో తాను కూడా ఒక బాధితురాలినని ఆమె తొలిసారిగా ప్రకటించారు.
కేసు విచారణలో ఉన్నందున ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని, కానీ ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు.
Read Also:SRH vs KKR Highlights: హైదరాబాద్‌పై కోల్‌కతా ఘనవిజయం
గొండా టోర్నీపై ఆందోళన
మే 12 నుంచి 14 వరకు బ్రిజ్ భూషణ్ కంచుకోట అయిన గొండాలో జరగనున్న నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో తాను పాల్గొంటున్నట్లు వినేశ్ తెలిపారు. అయితే, అక్కడ తనకు లేదా తన బృందానికి ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దానికి కేంద్ర ప్రభుత్వం, క్రీడా మంత్రిత్వ శాఖే పూర్తి బాధ్యత వహించాలని ఆమె తెలిపారు..
Vinesh Phogat Allegations
Vinesh Phogat: అక్రమాలపై ఆరోపణలు
బ్రిజ్ భూషణ్ మనుషుల నియంత్రణలో జరిగే ఈ టోర్నీలో పారదర్శకత ఉండదని ఆమె ఆరోపించారు. రిఫరీల నియామకం, పాయింట్ల కేటాయింపు, చివరికి క్రీడాకారుల బరువు చూసే ప్రక్రియలో కూడా మోసాలు జరిగే అవకాశం ఉందని వినేశ్ అనుమానం వ్యక్తం చేశారు. ఫెడరేషన్ నుంచి బ్రిజ్ భూషణ్‌ను తొలగించినా, ఇప్పటికీ ఆయన పెత్తనమే సాగుతోందని, దీనిపై క్రీడా మంత్రిత్వ శాఖ ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆమె విమర్శించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

