Speaker Gaddam Prasad Meets Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
జూన్ నెలాఖరులో తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళన మరియు విస్తరణ (Cabinet Expansion) ఉంటుందనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read also:Telangana State Formation Day : తెలంగాణలో పవన్ కీలక సమావేశం
Gaddam Prasad Kumar Meets Rahul Gandhi Telangana Cabinet Expansion Defection Dispute Ministry
స్పీకర్ పదవి వద్దు – మంత్రి పదవిపైనే కన్ను
రాహుల్ గాంధీతో జరిగిన భేటీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన మనసులోని అసంతృప్తిని, భవిష్యత్తు కార్యాచరణను అధిష్ఠానం ముందు ఉంచినట్లు కాంగ్రెస్ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. తనకు ఇకపై స్పీకర్ పదవిలో కొనసాగడం ఇష్టం లేదని, రాబోయే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిని కేటాయించాలని ఆయన స్పష్టంగా కోరినట్లు తెలుస్తోంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నందున, ఈసారి కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తనకు ఖచ్చితంగా చోటు కల్పించాలని ఆయన పట్టుబడుతున్నారు.
Speaker Gaddam Prasad Meets Rahul Gandhi:ఫిరాయింపుల అంశంపై అసంతృప్తి – ‘బలి పశువును చేశారు’
గత కొద్దికాలంగా రాష్ట్రంలో సాగుతున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేరికలు, ఫిరాయింపుల (MLA Defections) వ్యవహారంపై స్పీకర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఈ రాజకీయ పరిణామాలన్నింటిలో స్పీకర్ పదవిలో ఉన్న తనను వ్యూహాత్మకంగా బలి పశువును చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కోర్టు కేసులు, విపక్షాల విమర్శల వల్ల ఒక స్పీకర్‌గా తనకు అనవసరమైన అపకీర్తి మూటగట్టుకోవాల్సి వచ్చిందని, అందుకే ఈ పదవి నుంచి తప్పుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో మంత్రిగా ప్రజల్లోకి వెళ్లడానికే తాను మొగ్గు చూపుతున్నట్లు రాహుల్ గాంధీకి వివరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్ నెలాఖరులో జరగబోయే కేబినెట్ మార్పుల వేళ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త సమీకరణాలకు తెరలేపింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:

