Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నామినేటేడ్ పోస్టులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చిన మహేశ్ గౌడ్

నామినేటేడ్ పోస్టులకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చిన మహేశ్ గౌడ్

వార్త 0 months ago

Congress : తెలంగాణలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు.

నిజామాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వచ్చే సెప్టెంబర్ నాటికి అన్ని నామినేటెడ్ పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికీ తగిన న్యాయం చేస్తామని, కార్యకర్తల శ్రమను అధిష్టానం గుర్తించి గౌరవిస్తుందని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

పాత కార్యకర్తలకే మొదటి ప్రాధాన్యం: 70-80 శాతం పదవులు వారికే

నామినేటెడ్ పదవుల పంపిణీలో పార్టీ కోసం సుదీర్ఘకాలంగా జెండా మోసిన పాత కార్యకర్తలు, నాయకులకే సింహభాగం కేటాయిస్తామని పీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. మొత్తం పదవుల్లో 70 నుండి 80 శాతం స్థానాలను పార్టీ కష్టకాలంలో నిలబడిన పాత నిబద్ధత గల నేతలకు ఇస్తామని, మిగిలిన 20 శాతం పదవులను కొత్తగా పార్టీలో చేరిన వారికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఎటువంటి వర్గ రాజకీయాలు, గ్రూపులతో సంబంధం లేకుండా కేవలం పార్టీ కోసం నిజాయితీగా, క్రమశిక్షణతో పనిచేసిన వారికే పదవుల్లో తొలి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేయడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha