The Paradise movie: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, కయాదు లోహర్ కథానాయికగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం 'ది ప్యారడైజ్'.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి యూట్యూబ్‌ను ఊపేస్తోంది. దీంతో ఈ సినిమా నుంచి రాబోయే తదుపరి పాట కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also : Allari Naresh Ramba Oorvasi Menaka Teaser: అల్లరి నరేష్ 'రంభ ఊర్వశి మేనక' టీజర్ విడుదల
Release date confirmed for the special song from Nani’s movie ‘The Paradise’
The Paradise movie: పక్కా తెలంగాణ ఫోక్ మాస్ బీట్
ప్రస్తుతం ఫిలింనగర్ సమాచారం ప్రకారం 'ది ప్యారడైజ్' చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌గా ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ పాటలో నేచురల్ స్టార్ నానితో కలిసి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ స్టెప్పులేసినట్లు తెలుస్తోంది. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ కుదరడంతో ఈ పాటపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 26 లేదా 27 తేదీల్లో ఈ మాస్ సాంగ్‌ను అధికారికంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టెక్సాస్ కాన్సార్ట్‌లో అనిరుధ్ లైవ్ పర్ఫార్మెన్స్
ఈ చిత్రానికి సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఆయన పక్కా తెలంగాణ ఫోక్ మాస్ బీట్‌ను కంపోజ్ చేసినట్లు సమాచారం. అమెరికాలోని టెక్సాస్‌లో త్వరలో జరగనున్న తన మ్యూజిక్ కాన్సార్ట్‌లో అనిరుధ్ ఈ పాటను నేరుగా లైవ్‌గా పర్ఫార్మ్ చేసి విడుదల చేసే అవకాశం ఉందని తెలిసింది. అతిత్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

