The Paradise : నాచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' విడుదలపై గత కొన్ని రోజులుగా వస్తున్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని రాబోయే సెప్టెంబర్ 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్లు సమాచారం. దసరా పండగ సీజన్‌కు ముందే ఈ చిత్రాన్ని విడుదల చేసి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడమే లక్ష్యంగా చిత్రబృందం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఒక పవర్‌ఫుల్ ‘రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ టీజర్’ను కూడా అతి త్వరలోనే విడుదల చేయడానికి సినీ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

‘దసరా’ కాంబో మ్యాజిక్.. సెకండ్రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ డ్రామా
బ్లాక్‌బస్టర్ సినిమా ‘దసరా’ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. 1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నాని మునుపెన్నడూ చూడని అత్యంత ఊరమాస్, వయలెంట్ లుక్‌లో కనిపించబోతున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

