Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాని తర్వాతే పవన్ కళ్యాణ్..?

నాని తర్వాతే పవన్ కళ్యాణ్..?

వార్త 1 day ago

Nani - Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఓజీ ఒకటి. ఈ సినిమా గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా మేకర్స్ ఓజీ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెబుతూ ఓజీ 2ను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు, పవన్ కళ్యాణ్ (Nani – Pawan Kalyan) కూడా ఓజీ 2పై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ఓజీ 2తో పాటు న్యాచురల్ స్టార్ నానితో :

అయితే ఇదే సమయంలో దర్శకుడు సుజీత్ తదుపరి ప్రాజెక్ట్‌లపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఓజీ 2తో పాటు న్యాచురల్ స్టార్ నానితో కూడా సుజీత్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బ్లడీ రోమియో అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ సినిమాతో బిజీగా ఉండగా, ఆ సినిమా విడుదలైన వెంటనే బ్లడీ రోమియో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఓజీ 2 ప్రకటన వచ్చిన వెంటనే, ముందుగా అదే సినిమా ప్రారంభమవుతుందని చాలామంది భావించారు. కానీ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం సుజీత్ తన షెడ్యూల్‌ను మరోలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా నానితో బ్లడీ రోమియో చిత్రాన్ని పూర్తి చేసి, ఆ తర్వాతే ఓజీ 2ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారట.

ఈ ప్రచారం నిజమైతే, సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించే ఓజీ 2 కోసం అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సి రావచ్చు. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ప్రస్తుతం వినిపిస్తున్నవి ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంగానే చూడాలి. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ రెండు సినిమాల షూటింగ్ షెడ్యూల్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha