Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఒక్కటవుతారు: కొండా సురేఖ

నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఒక్కటవుతారు: కొండా సురేఖ

వార్త 2 weeks ago

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి కొండా సురేఖ పార్టీ నాయకులకు మరియు హైకమాండ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

తనపై ఏవైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే బీసీ వర్గాలన్నీ ఒక్కటవుతాయని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తించాలని, కేవలం తనను మాత్రమే టార్గెట్ చేయడం సరికాదని ఆమె ఘాటుగా బదులిచ్చారు.

రెడ్డి నేతల వ్యాఖ్యలపై మౌనమెందుకు?

తనకంటే ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రెడ్డి వర్గానికి చెందిన నాయకులపై ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ సూటిగా ప్రశ్నించారు. పార్టీలో కొందరికి ఒక రూల్, మరికొందరికి మరో రూలా అని నిలదీశారు. నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Konda Surekha: పలువురు మంత్రులపై కమీషన్ల ఆరోపణలు

ఈ సందర్భంగా ఆమె మరికొంత మంది మంత్రులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని పలువురు మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ముఖ్యంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, భట్టి విక్రమార్క భార్యలకు సంబంధించిన కమీషన్ల వ్యవహారంపై కూడా ఫిర్యాదులు అందాయని ఆమె గుర్తుచేశారు. ఈ ఆరోపణలకు పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారని ఆమె నిలదీశారు.

ముందు సీఎం రేవంత్‌పై చర్యలు తీసుకోండి: కొండా సురేఖ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha