Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాపై కోపంతోనే సొరంగం పనులు ఆపేశారు.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు

నాపై కోపంతోనే సొరంగం పనులు ఆపేశారు.. కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి విమర్శలు

వార్త 6 days ago

Komatireddy Venkat Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని ఆయన ఆరోపించారు.

శనివారం నల్గొండ జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పాలనా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే కేసీఆర్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని మంత్రి ఆరోపించారు. 2007లోనే అమెరికా నుంచి అధునాతన యంత్రాలను తెప్పించి సొరంగం పనులు ప్రారంభించామని, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక వాటిని నిలిపివేశారని తెలిపారు. అప్పట్లో ఆ పనులను కొనసాగించి ఉంటే కేవలం వెయ్యి కోట్లతో రెండేళ్లలోనే ప్రాజెక్టు పూర్తయ్యేదని గుర్తుచేశారు. తాను ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేసీఆర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆనాడు పనులు పూర్తయి ఉంటే, ప్రస్తుత కరవు పరిస్థితుల్లోనూ నల్గొండ ప్రాంతంలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అంది ఉండేదని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ హయాంలో పనుల పునరుద్ధరణ మరియు భవిష్యత్ కార్యాచరణ

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు మంత్రి వెల్లడించారు. తాము స్వయంగా అమెరికాకు వెళ్లి కాంట్రాక్టర్‌కు రూ.300 కోట్లు చెల్లించి నిలిచిపోయిన పనులను మళ్లీ పునరుద్ధరించామని చెప్పారు. వచ్చే రెండేళ్లలో సొరంగం పనులను పూర్తి చేసి నల్గొండ సస్యశ్యామలం చేస్తామని, రెండు పంటలకు సాగునీరు అందిస్తామని ధైర్యం చెప్పారు. ఖచ్చితంగా 2028 జూలై నాటికి ఈ సొరంగాన్ని ప్రజలకి అంకితం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Komatireddy Venkat Reddy: కేసీఆర్ కుటుంబం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయకుండా నల్గొండ జిల్లా ప్రజలకు తీవ్రద్రోహం చేశారని మంత్రి మండిపడ్డారు. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు వెంటనే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాంత రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. అందుకే ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను తిరస్కరించారని, రానున్న రోజుల్లో తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగవడం తథ్యమని జోస్యం చెప్పారు.

ఆగస్టు 15 వరకు మూడు నెలల రేషన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha