Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి

నారా లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి

వార్త 1 month ago

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ కోసం నిబద్ధతతో శ్రమించే ప్రతి కార్యకర్తను పార్టీ సముచితంగా గౌరవిస్తుందని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం అంకితభావంతో పనిచేసే నాయకులకు ఉన్నత అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ఆయన పునరుద్ఘాటించారు.

నారా లోకేశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ రమాదేవి

గవర్నర్ కోటాలో నూతన శాసనమండలి సభ్యురాలిగా (ఎమ్మెల్సీ) ఎంపికైన దళవాయి రమాదేవి మంగళవారం అమరావతిలో తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా కలిశారు. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి తన సేవలను గుర్తించి ఎమ్మెల్సీ పదవి కల్పించినందుకు ఆమె మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరింత బాధ్యతగా పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.

Nara Lokesh: రమాదేవి సేవలను కొనియాడిన మంత్రి లోకేశ్

ఈ సందర్భంగా నూతన ఎమ్మెల్సీ దళవాయి రమాదేవిని మంత్రి నారా లోకేశ్ అభినందించారు. పార్టీ పట్ల ఆమె చూపుతున్న నిబద్ధతకు, దశాబ్దాల సేవలకు దక్కిన తగిన గుర్తింపుగా ఈ పదవిని అభివర్ణించారు. రానున్న కాలంలో ప్రజల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలకు చేరవేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. శాసనమండలి వేదికగా ప్రజల గొంతును మరింత గట్టిగా వినిపించాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత

వడ్డెర సామాజిక వర్గానికి చెందిన అంకితభావం గల మహిళా నేత దళవాయి రమాదేవి గవర్నర్ కోటాలో శాసనమండలికి నామినేట్ కావడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కష్టపడే వారికి రాజకీయంగా తగిన వేదిక కల్పిస్తామన్న దానికి ఈ నియామకం మరో నిదర్శనంగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు - స్థానిక సంస్థల ఎన్నికలు & బిసి రిజర్వేషన్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha