Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నారీశక్తికి పట్టం!

నారీశక్తికి పట్టం!

వార్త 2 months ago

Women's Bill : లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లులను కేంద్రం బూజుదులిపి బయటకు తీయడం ఆహ్వానించదగి నదే కానీ ఆ రెండు బిల్లులనూ ఒకేసారి లింకు పెట్టడం విపక్షాలకు రుచించడం లేదు.

ఇరవై ఏళ్లనాటి నుంచి మహిళా బిల్లు నలుగుతోంది. ఎన్నోసార్లు అటక మీద నుంచి దించారు. కొన్ని ఉత్తరాది పార్టీలు మహిళలకు పెత్తనం ఇవ్వడానికి అంగీకరించక అడ్డుపడిన సందర్భా లు ఎన్నో ఉన్నాయి. ఈసారి పెద్దగా అభ్యంతరం ఉండ దని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మహిళా సాధికారత వలన దేశ కాలమాన పరిస్థితుల్లో మార్పులు వచ్చినందున మహిళలకు రాజకీయాల్లో 33 శాతం సీట్లు కేటాయించడం సబబేనని పలు వేదికల్లో చెబుతున్నారు. దేశ నిర్మాణంలో కీలక పాత్రలు పోషించే అవకాశం దొరి కిన ప్రతిసారీ మహిళానేతలు అద్భుతమైన పనితీరు ప్రద ర్శిస్తున్నారు. రాష్ట్రపతి నుంచి కేంద్ర ఆర్థిక మంత్రివరకు మహళల పనితీరు చూస్తే అద్భుతంగా ఉందని వివరిం చారు. చట్టసభల్లో సముచిత ప్రాతినిధ్యం కోసం దశాబ్దా లుగా మహిళలు ఎదురుచూస్తున్నందున నేడు లోక్సభ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం స్వాగతించా ల్సిన సందర్భం.

Read Also: Parliament Updates 2026: జీరో అవర్ రద్దు.. బిల్లులకే ప్రాధాన్యం!

 Women’s Bill

Women’s Bill : రాజకీయాల్లో మేలు మలుపు

ప్రస్తుత చట్టం ప్రకారం 2034 నుంచి మాత్రమే మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి వీలవు తుంది. అందుకే తక్షణమే 2029 నుంచి మహిళా రిజర్వే షన్లు అమలు చేసేందుకు వీలుగా నారీ శక్తి వందన్ అధినయమ్కు రాజ్యాంగ సవరణ చేసేందుకుగురువారం ముహూర్తంగా నిర్ణయించారు. భారతీయ మహిళలకు అన్ని అంశాల్లోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయగలిగితే 2029 నుంచి మహిళ లకు అసెంబ్లీ, లోక్సభ సీట్లలో 33శాతం వారికి దక్కు తాయి. వీటి కోసమే ప్రత్యేకించి మూడు రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు నిర్వహించేందుకు ప్రధాని కంకణం కట్టుకున్నారు. లోక్సభ స్థానాలు 816కు పెంచ గలిగితే వాటిల్లో మహిళల వాటాగా 273 స్థానాలు రిజర్వు అవుతాయి. ఇంతదాక రాజకీయ వారసత్వమున్న కుటుం బాల్లోని మహిళలకే అరకొరగా సీట్లు దక్కుతుండేవి. ఈ సారి రాజకీయేతర కుటుంబాలలోని మహిళలకు కూడా ప్రజాసేవ చేసే అవకాశం లభిస్తుంది. ఇది రాజకీయాల్లో మేలు మలుపు. ఇదే సందర్భంలో పనిలోపనిగా లోక్సభ స్థానాల రిజర్వేషన్ల బిల్లు కూడా ప్రవేశపెట్టడం వలన మహిళల భాగస్వామ్యం బాగా పెరుగుతుంది.

ఏపార్టీకి అభ్యంతరం లేదు

ఇప్పటికే దేశవ్యాప్తంగా 14లక్షల మందికిపైగా మహిళలు స్థానిక పాలనలో తర్ఫీదు పొందారు. 21 రాష్ట్రాల్లోని పంచాయతీల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు 50 శాతానికి చేరుకుందన్న సమాచారం ఉంది. 2023లోనే పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుకు అందరూ ఆమోదించినా అమలు వరకూ చేరుకోలేదు. అంతక్రితం కాదనుకున్న రాజకీయ పార్టీల్లో కూడాసానుకూలత ఏర్ప డినందునే ఆ బిల్లు పాస్ అయింది. దానికిప్పుడు రాజ్య సభలో కూడా సంపూర్ణ సానుకూలత సాధించి బిల్లుపాస్ అయ్యే స్థాయికి చేరుకుంది. మహిళా బిల్లు విషయంలో ఇప్పుడు ఏపార్టీకి అభ్యంతరం లేదు. ఈచట్టం అమలుపై అన్ని విపక్ష పార్టీలతో సమగ్ర చర్చ నిర్వహించే విషయం లో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఏ మాత్రం ఆసక్తి లేదని ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపిస్తు న్నారు. అయితే తమ నేతృత్వంలోనే మహిళలకు అగ్ర తాంబూలం లభిస్తోందని చెప్పుకోవాలనే తపనతో భార తీయ జనతా పార్టీదేశవ్యాప్తంగా అన్నిప్రాంతాల్లో మహిళా సదస్సులు నిర్వహించ తలపెట్టింది. ఏప్రిల్ 16 నుంచి మూడు రోజులపాటు జరిగే పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టరూపం దాల్చుతుంది.

 Women’s Bill

సానుకూల పరిస్థి తులు

మహిళా రిజర్వేషన్బిల్లు, డీలిమిటేషన్ బిల్లుకు ముడి పెట్టి సభ ముందుకు తెచ్చేప్రక్రియను మాత్రమేకాంగ్రెస్, తదితర విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటేషన్ బిల్లు కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల ఎంపీలలో తీవ్రఅభ్యం తరాలున్నాయి. మహిళా బిల్లుకు ఓకె చెప్పినా, పునర్విభజన బిల్లును అంగీకరించేందుకు కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి వంటి పార్టీలు సిద్ధంగాలేవు. ఆయా పార్టీల సభ్యు లకు పార్టీలు విప్లు జారీ చేశాయి. లోక్ సభ సీట్లను 543 నుంచి 816 సీట్లకు పెంచడం వలన దక్షిణాది రాష్ట్రాలతోపాటు చిన్నరాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరు గుతుందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తీర్మా నించింది. దాని మీద ఎన్నోవిశ్లేషణలు కూడాజరిగాయి. 2027 జనాభా లెక్కలు జరిగే సమ యంలో ఆదరా బాదరాగా ప్రవేశపెడుతున్న డీలిమిటేషన్ ప్రక్రియను మాత్రమే వ్యతిరేకిస్తున్నట్లు సోనియాగాంధీ వివరిస్తున్నారు. ఏదిఏమైనా అనేక అభ్యంతరాలున్న మహిళా రిజర్వే షను బిల్లుపై కాలక్రమంలో అందరికీ సానుకూల పరిస్థి తులు కల్పించగా, డీలిమిటేషన్ బిల్లు మాత్రం రాజకీయ ఉద్దేశంతో తెచ్చినదిగా భావించి విపక్షాలు అప్పుడేనా? అంటున్నాయి. చట్టసభల సీట్లను పెంచే డీలిమిటేషన్వి షయంపై అనేక అంశాలు ముడిపడినందున అధ్యయ నం చేసేందుకు రాజకీయ పార్టీలకు సమయం సరిపో నం దున మరిన్ని రోజులు గడువు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. రాజ్యాంగంలోని 82వ అధికరణం మేరకు ‘జనగణన’ తర్వాతనే జనాభా ప్రాతిపదికనే సీట్లు సర్దు బాటు జరగాలి. కొద్ది రోజులో జనగణన పూర్తవవుతున్న సందర్భంలో ‘ఆగమేఘాలపై డీ లిమిటేషన్’ బిల్లు ప్రవేశ పెట్టడంలో ఔచిత్యం ఏమిటంటా డిఎంకె అధినేతస్టాలిన్ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సీట్ల నిష్పత్తికి విరుద్ధంగా ఏమీ జరగదని ప్రధాని భరోసా ఉండనే ఉంది. ఎట్నుంచి ఎటు వచ్చినా మహిళలకు పట్టం కట్టడం మాత్రం ఖాయం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

రుగ్వేద శ్లోకంతో ప్రధాని మోదీ ట్వీట్.. నారీశక్తిపై ప్రశంసలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha