Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నార్సింగి సోలార్ ట్రాక్‌లో మార్పులు.. కొంత భాగం తొలగింపు

నార్సింగి సోలార్ ట్రాక్‌లో మార్పులు.. కొంత భాగం తొలగింపు

వార్త 0 months ago

Solar Roof Cycling Track: భాగ్యనగర కీర్తికిరీటంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రపంచ స్థాయి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌కు అధికారులు కోత పెట్టారు.

నార్సింగి పరిధిలోని మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద రోజురోజుకూ పెరిగిపోతున్న వాహనాల రద్దీని తట్టుకునేందుకు, ట్రాక్‌లోని దాదాపు 34 మీటర్ల మేర భాగాన్ని అధికారులు తొలగించారు. ఆ ప్రాంతంలో వాహనదారుల సౌకర్యార్థం కొత్తగా యూ-టర్న్ (U-Turn) నిర్మించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే, అధికారుల ఈ నిర్ణయంపై నగరంలోని సైక్లిస్టులు, పర్యావరణ హితాన్ని కోరుకునే వారి నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

రూ. 93 కోట్ల ప్రతిష్టాత్మక ప్రాజెక్టు.. ట్రాఫిక్ పోలీసుల సూచనలతోనే మార్పులు!

ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పక్కన సుమారు రూ. 93 కోట్ల భారీ బడ్జెట్‌తో 23 కిలోమీటర్ల పొడవునా ఈ అత్యాధునిక సోలార్ సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మించారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సుల ఆధారంగానే ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) అధికారులు వెల్లడించారు. ట్రాక్ తొలగించిన చోట సైక్లిస్టులు అట్-గ్రేడ్ క్రాసింగ్ (రోడ్డుపై నుంచే దాటడం) ద్వారా ప్రయాణించేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశామని, దీనివల్ల సైక్లింగ్‌కు పెద్దగా ఇబ్బంది ఉండదని అధికారులు సమర్థించుకుంటున్నారు.

Solar Roof Cycling Track: ప్రపంచ స్థాయి మౌలిక వసతులను నాశనం చేస్తున్నారు: సైకిల్ మేయర్ ఆవేదన

అధికారుల తీరుపై సైక్లింగ్ కమ్యూనిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైదరాబాద్ సైకిల్ మేయర్ ఎస్. సెల్వన్ ఈ ఉదంతంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా స్పందించారు. “కార్ల కోసం, ఇతర వాహనాల కోసం ఎంత స్థలాన్ని కేటాయించినా సరిపోదు. అంతమాత్రానికే ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను ఇలా ముక్కలు చేయడం సరికాదు” అని ఆయన మండిపడ్డారు. దేశ, విదేశాల్లోని ఎన్నో నగరాలు హైదరాబాద్ సోలార్ సైకిల్ ట్రాక్‌ను ఒక రోల్ మోడల్‌గా తీసుకున్నాయని, అలాంటి ప్రాజెక్టును దెబ్బతీయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను నిర్దేశిత గడువు లోపు పూర్తి చేయాలి:కలెక్టర్ ప్రతిమాసింగ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha