Major Train Incident in England : నార్త్ లండన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఒక దిగ్భ్రాంతికరమైన రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌లోని ప్రముఖ సెయింట్ పాన్‌క్రాస్ స్టేషన్ వైపు వెళ్తున్న రెండు ప్యాసింజర్ రైళ్లు బెడ్‌ఫోర్డ్ నగరం సమీపంలో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి.
రైల్ ట్రాకింగ్ డేటా ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వేళలో ఈ ఘోరం జరిగింది. ఈ భీకర ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల ఆర్తనాదాలు, కేకలతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. చాలామంది ప్రయాణికులకు కాళ్లు, చేతులు విరిగి రక్తసిక్తమవగా.. కొందరు కిటికీల గుండా బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ప్రమాద తీవ్రతకు రైలు బోగీల నుంచి పెద్ద ఎత్తున పొగలు వ్యాపించడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.
Read Also : ఇండియా పై అమెరికన్ మహిళ ప్రశంసలు

రంగంలోకి సహాయక చర్యలు.. దర్యాప్తు ప్రారంభం
ఈ ఘోర ప్రమాదంపై రైల్వే వర్కర్స్ యూనియన్ వెంటనే స్పందించి, సహాయక చర్యలను వేగవంతం చేసింది. గాయపడిన బాధితులను అత్యవసరంగా సమీప ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా లేక మానవ తప్పిదమా అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. కాగా, ఈ ప్రమాద స్థలానికి సంబంధించిన గుండెలవైసే ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బ్రిటన్ రవాణా రంగాన్ని కుదిపేసిన ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించింది..
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

