Jobs in NWR: రైల్వే రంగంలో ఉద్యోగం సాధించాలనుకునే యువతకు నార్త్ వెస్టర్న్ రైల్వే (NWR) తీపి కబురు అందించింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 2,008 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50% మార్కులతో 10వ తరగతి (ఎస్సెస్సీ) ఉత్తీర్ణత సాధించి ఉండటంతో పాటు, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (ITI) కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయానికొస్తే 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులుగా పరిగణింపబడతారు. అయితే నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోసడలింపు వర్తిస్తుంది.
రాత పరీక్ష లేదు - మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియపారామెడికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఈ నోటిఫికేషన్ యొక్క ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష (Written Exam) నిర్వహించకపోవడం. అభ్యర్థులు 10వ తరగతి మరియు ఐటీఐలలో సాధించిన మార్కుల ఆధారంగా రూపాందించే మెరిట్ లిస్ట్ (Merit List) ద్వారా తుది ఎంపిక ఉంటుంది. మెరిట్ జాబితాలో నిలిచిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ (వైద్య పరీక్షలు) ఆధారంగా ఎంపిక చేసి అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు. రైల్వే శాఖలో సాంకేతిక నైపుణ్యాలు పెంచుకోవడంతో పాటు భవిష్యత్తులో రైల్వే కొలువు సాధించడానికి ఈ అప్రెంటిస్ శిక్షణ ఎంతో దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

