Vijaya mehta: ఆధునిక మరాఠీ నాటకరంగం మరియు భారతీయ ప్యారలల్ సినిమాకు (Parallel Cinema) ఒక కొత్త దిశానిర్దేశం చేసిన దిగ్గజ దర్శకురాలు, నటి మరియు నిర్మాత విజయా మెహతా (Vijaya Mehta) వయసు సంబంధిత అనారోగ్య సమస్యలతో తన 91వ ఏట జూన్ 30, 2026 (మంగళవారం) రాత్రి ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.
కళాకారులందరూ ఎంతో ముద్దుగా, గౌరవంగా ‘బాయి’ (Bai) అని పిలుచుకునే ఆమె మరణం.. భారతీయ నాటకరంగానికి తీరని లోటు అని సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Samantha Baby Bump Photo : బేబీ బంప్ ఫొటో షేర్ చేసిన సమంత
నాటకరంగానికి ‘బాయి’ చేసిన అమోఘమైన సేవలు
Vijaya Mehta Passed Away
1934లో గుజరాత్‌లోని బరోడాలో జన్మించిన విజయా మెహతా, ప్రఖ్యాత థియేటర్ డైరెక్టర్ ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ పొందారు. 1960లలో ప్రముఖ రచయిత విజయ్ టెండూల్కర్, నటులు శ్రీరామ్ లాగు, అరవింద్ దేశ్‌పాండేలతో కలిసి ఆమె ముంబైలో ‘రంగాయన్’ (Rangayan) అనే ప్రయోగాత్మక నాటక సంస్థను స్థాపించారు. కమర్షియల్ నాటకాలకు భిన్నంగా సామాజిక స్పృహతో కూడిన బోల్డ్ నాటకాలను తెరకెక్కించి ఆమె మరాఠీ థియేటర్ ముఖచిత్రాన్ని మార్చేశారు. ‘ఏక్ శూన్య బాజీరావు’, ‘బారిస్టర్’, ‘హమీదాబాయిచీ కోఠీ’, ‘మహాసాగర్’ వంటి ఎన్నో అద్భుతమైన నాటకాలకు ఆమె దర్శకత్వం వహించారు. నాటకాలే కాకుండా ‘రావ్ సాహెబ్’ (1986), ‘పెస్టోంజీ’ (1988) వంటి అవార్డ్ విన్నింగ్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. , ‘పార్టీ’ వంటి చిత్రాలలో నటిగా తనదైన ముద్ర వేశారు. ఉత్తమ సహాయ నటిగా నేషనల్ అవార్డుతో పాటు సంగీత్ నాటక్ అకాడమీ పురస్కారం, పద్మశ్రీ (1987) లభించాయి.
Vijaya mehta: అనుపమ్ ఖేర్ భావోద్వేగ నివాళులు
విజయా మెహతా మరణవార్త విన్న వెంటనే ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘమైన పోస్ట్‌ను పంచుకున్నారు. ‘రావ్ సాహెబ్’, ‘పెస్టోంజీ’ సెట్స్‌లో ఆమెతో పనిచేసిన అపురూపమైన రోజులను గుర్తుచేసుకున్న ఆయన.. “భారతదేశం గర్వించదగ్గ గొప్ప థియేటర్ మైండ్స్ లో ఆమె ఒకరు. ఆమె ఎప్పుడూ తన జ్ఞానాన్ని మాపై రుద్దలేదు, దానిని ప్రకాశింపజేశారు. మాపై ఏనాడూ అరిచేవారు కాదు, కానీ మా నటన స్థాయిని పెంచారు” అని రాసుకొచ్చారు. నటన అంటే కేవలం పర్ఫార్మ్ చేయడం కాదని, జీవితాన్ని అర్థం చేసుకోవడం అని ఆమె ఎంతో మంది నటులకు నేర్పించారని ఆయన కొనియాడారు. నానా పటేకర్, మోహన్ అగాషే వంటి ఎందరో ప్రముఖ నటులకు ఆమె గురువుగా, మార్గదర్శకురాలిగా నిలిచారు.
Epaper: epaper.vaartha.com

