Dailyhunt
NABARD: అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NABARD: అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

వార్త 2 months ago

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) డెవలప్‌మెంట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 162 పోస్టులు భర్తీ చేయనుండగా, ఇందులో( AP ) ఆంధ్రప్రదేశ్‌కు 8 పోస్టులు కేటాయించారు.

డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. (NABARD)దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే ప్రారంభమై ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుంది.

Read also: US: L1 వీసాపై పని లేకుండా అమెరికాలో ఉంటే ఏమవుతుందో తెలుసా?

ఎంపిక విధానం

అభ్యర్థులను మూడు దశల్లో ఎంపిక చేస్తారు.

  • ప్రిలిమినరీ రాత పరీక్ష
  • మెయిన్ రాత పరీక్ష
  • లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్

పరీక్షల తేదీలు

  • ప్రిలిమినరీ పరీక్ష: ఫిబ్రవరి 2
  • మెయిన్ పరీక్ష: ఏప్రిల్ 12

దరఖాస్తు ఫీజు

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: రూ.550
  • ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు: రూ.100

ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలు, ఆన్‌లైన్ దరఖాస్తు కోసం www.nabard.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని నాబార్డ్ సూచించింది.

ఈ నోటిఫికేషన్ బ్యాంకింగ్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు మంచి అవకాశంగా భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

HDFC Bank: మూడో త్రైమాసికంలో పెరిగిన బ్యాంక్ నికర లాభాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha