Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నదులలో నీరు ఉన్నా సాగునీరు ఇవ్వలేరా?

నదులలో నీరు ఉన్నా సాగునీరు ఇవ్వలేరా?

వార్త 1 week ago

Irrigation water : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో నీటి నిల్వ లు పడిపోయాయని, అందువల్ల కృష్ణాడెల్టాకు సాగు నీరు ఇవ్వలేమని జూలై24న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంత్రివర్గ సమావేశం ప్రకటించింది.

మంత్రివర్గ నిర్ణయాన్ని సమాచార మంత్రి కె. పార్థసారథి తెలియచేశారు. వరిపంట వేయవద్దని, వరి పంట వేస్తే తర్వాత నీరులేక నష్టపోయేది మీరేనని రైతులకు హెచ్చరిక జారీచేశారు. ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షాభావంతోపాటు కరవు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఖరీఫ్కు చాలా ముందే ప్రకటించారు. ఆవిధంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం ఎల్సినో ప్రభావాన్ని ఎదుర్కోవడానికి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. కాని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోలేదు. నదుల్లో నీరునిల్వకు అవసరమైన చర్యలు తీసుకోలేదు. అలాంటి చర్యలు తీసుకోకుండా సాగునీటి విడుదల గురించి ఆర్భాటపు ప్రకటనలు చేశారు. జూన్ 1 నుంచే కాల్వలకు నీరువిడుదల చేస్తామని మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు ప్రకటించారు. కృష్ణాడెల్టాకి జూలై 1 నుంచి, నాగార్జునసాగర్ ఆయకట్టుకు జూలై చివరికి, కేసీ కెనాల్కి వంశధార ఆయకట్టుకు జూలై 15 నుంచి సాగునీరు విడుదల చేస్తామని, రైతులు సేద్యా నికి సిద్ధం కావాలని చెప్పారు.

 Irrigation water

Irrigation water : సాగుకు అవసరమైన నీటి లభ్యత ప్రస్తుతం లేదని

కృష్ణా డెల్టా ఆయకట్టుక్ 150 టిఎంసిలు అవసరమని, బ్యారేజిలో 461 టిఎంసిల నీరు అందుబాటులో ఉందని కూటమి ప్రభుత్వం ప్రకటించి జూలై1న ప్రకాశం బ్యారేజీ నుంచి ఆర్భాటంగా నీరు విడు దల చేసింది. మంత్రుల ప్రకటనతో రైతాంగం ఖరీఫ్ సేద్యా నికి సమాయత్తం అవుతూ ఉండగా రాష్ట్రప్రభుత్వం కృష్ణా డెల్టాకి సాగునీరు విడుదల చేయలేమని జూలై 24న ప్రక టించింది. మంత్రివర్గ ప్రకటన తర్వాత ఇరిగేషన్ శాఖ సమావేశం జరిగింది. ఆ సమావేశం అనంతరం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీరు ఎల్సినో ప్రభావం వల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలో, వర్షాలు తగ్గాయని చెప్పారు. రాష్ట్రంలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం తాగునీటికే ప్రాధాన్యత ఇచ్చిం దని చెప్పారు. పులిచింతల నీటిని కూడా తాగునీటి అవన రాలకే భద్రపర్చినట్లు వెల్లడించారు. గోదావరి ప్రవాహం తగ్గడంతో పట్టిసీమ ఎత్తిపోతల పంపింగ్ పై ప్రభావం పడిం దని అన్నారు. సీలేరు నీటి లభ్యత కూడా తగ్గిందని చెప్పారు. అందువల్ల కృష్ణా డెల్టా సాగుకు అవసరమైన నీటి లభ్యత ప్రస్తుతం లేదని చావు కబురు చల్లగా చెప్పారు. ప్రకాశం బ్యారేజి నుంచి అనధికారికంగా నీరు తీసుకోవద్దని రైతాంగానికి హెచ్చరిక జారీచేశారు. కుడికాల్వ పరిధిలో రైతులు వరిసాగు చేయవద్దని చెప్పారు. ఆరుతడి పంటలు సాగుచేయాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం చెప్పే మాట లు వాస్తవ విరుద్ధంగా

జూన్, జూలై నెలల మధ్య సాగు నీరు విడుదల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరి లో మార్పువచ్చింది. జూన్ నెలలో రాష్ట్ర ంలోని అన్ని ప్రాం తాలకు సాగునీరు విడుదల తేదీలను కూటమి మంత్రులు ప్రకటించారు. సాగుకి రైతులు సిద్ధం కావాలని చెప్పారు. మంత్రుల ప్రకటనతో అప్పులు చేసి సేద్యానికి కావాల్సిన వాటిని నమకూర్చుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఎకరాకు 10 వేలకు పైగా రైతులు సేద్యానికి ఖర్చుచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్సెనో ప్రభావం వల్ల ఇప్పుడు సాగు నీరు ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం వల్ల రైతాంగం తీవ్ర మైన మనోవేదనకు గురౌతున్నారు. జూలై1లో 461 టిఎం సిల నిల్వ ఉన్న నీరు జూలై23 నాటికి ఏమైంది. సాగునీరు ఇవ్వలేమని ప్రభుత్వం ఎలా చెప్పగలుగుతున్నది. ఎల్ననో ప్రభావం. ముందుగానే కూటమి ప్రభుత్వానికి తెలుసుగా, తెలిసే సాగునీరు ప్రాంతాల వారిగా విడుదల చేస్తామన్నది గదా! ఇప్పుడు సాగునీరు విడుదల సాధ్యం కాదని చెప్పడం రైతులను మోసం చేయడం కాదా! సేద్యంపైనే చిన్న, సన్న కారు రైతు కుటుంబాల ఆధారపడి ఉన్న విషయం కూటమి ప్రభుత్వానికి తెలియదా, ఆ కుటుంబాల పరిస్థితి ఏమికా వాలి. సాగునీరు విడుదల గురించి ప్రభుత్వం చెప్పే మాట లు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి.

ఆగస్టు నెల నాటికి పూర్తిగా సేద్యం జరగాలి

జలవనరుల వ్యవస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రకాశం బ్యారేజి నీటినిల్వ 2.978 టిఎంసిలు కాగా, పూర్తి నీటిమట్టం 3.071 టిఎంసిలు. అంటే పూర్తి నీటి మట్టానికి అతితక్కువ మాత్రమే, 96.97 నీటి నిల్వతో సురక్షితంగా ఉన్నందువల్ల సాగునీటి సర ఫరాకు ఎటువంటి ఆటంకం లేదని నిపుణులు చెబుతున్నారు. డెడ్ స్టోరేజికి చేరాలంటే 2 టిఎంసిల కంటే తక్కువ ఉండాలి.బ్యారేజిలో నీరులేనప్పుడు సాగునీరు ఇవ్వాల్సి వస్తే. నాగార్జున సాగర్లేదా పులిచింతల నుంచి నీరు విడు దల చేయాలి. పులిచింతలలో ప్రస్తుతం 29.039 టిఎంసి లనీరు ఉంది. సాగు, తాగునీటి అవసరాలకు నీటిని దిగువకు విడుదల చేయవచ్చని కూడా నిపుణులు అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం సాగునీరు ఎందుకు విడుదల చేయడం లేదు. గతంలో బ్యారేజిలో ఇంతకన్నాతక్కువనీరు ఉన్నప్పుడే సాగునీరు విడుదల చేయడం జరిగింది. కృష్ణా డెల్టాలో ప్రధాన సేద్యం వరి. అలాంటి వరిసేద్యం చేయ వద్దంటే, రైతులు ఖరీఫ్ సేద్యానికి దూరం కావడమేగదా! ఆగస్టు నెల నాటికి పూర్తిగా సేద్యం జరగాలి. ఆ తర్వాత పంటలు వేసినా ప్రయోజనంలేదు. నల్లరేగడి భూముల్లో ఇప్పుడు ఆరు తడిపంటల సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆరుతడి పంటలకు మళ్లడం కూడా రైతులకు చాలా ఇబ్బందికరం అవుతుంది. వరిసేద్యం జరగకపోతే ఆహార సమస్యకూడా ముందుకు వస్తుంది.

 Irrigation water

చెరవులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు

రెండు కోస్తాతీర ప్రాంతాల్లోని చాలా జిల్లాల్లో వరిపంట తర్వాత జొన్న, మొక్కజొన్న వంటవేస్తారు. ఈపంటలు రైతులకు కొంత మిగులు ఆదాయాన్ని ఇస్తున్నాయి. ప్రకాశం బ్యారేజి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేయకపోతే ఆ వంట ల సేద్యం సాధ్యం కాదు. అందువల్ల రైతులకు తీవ్రనష్టం జరుగుతుంది. ఆరుతడి పంటలు వేయమనే కూటమి ప్రభు త్వం, అందుకు అవసరమైన వాటిని కూడా ముందు జాగ్ర త్తగా సిద్ధం చేయలేదు. రైతులు వాటిని సమకూర్చుకోవా లంటే అనేక అవస్థలుపడాలి. అవస్థలు పడి ఆరుతడి పంట వేసినా చేతికి వస్తాయనే నమ్మకంలేదు. వరిపంట వల్ల మిగులు ఎక్కువలేకపోయినా నష్టం అనేది తక్కువగా ఉండటం తో రైతాంగం వరిపంట సాగుకే మొగ్గుచూపుతున్నారు. నేడు సాగునీటి సమస్యకు పాలకుల విధానాలే కారణం. ఎల్సినో ప్రమాదం గురించి ముందుగానే సమాచారం ఉన్నప్పుడు నదుల నీటినిల్వల గురించి సరైన చర్యలు తీసుకోవాలి. అ లాంటి చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకోలేదు. భారతదేశం లో అత్యధిక చెరువులు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశముందు ఉంది. 2023లో కేంద్ర ప్రభుత్వ లెక్కలప్రకారం రాష్ట్రంలో 1,90,777 నీటి వనరులుండగా, వాటిల్లో 99.7 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో 81.703 చెరువులు పంచా యతీ ఇరిగేషన్ వంటి ప్రభుత్వశాఖల పరిధిలో ఉన్నాయి. ఈ చెరవులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుని, పూడికలు తీసి నీటితో వాటిని నింపి ఉంటే, వాటి ద్వారా సాగునీరు లభించేది. చెరువులను కాపాడే చర్యలను ఏ ప్రభు త్వం తీసుకోలేదు. పట్టిసీమ ఎత్తిపోతల పంపింగ్ గురించి గొప్పలు చెప్పేకూటమి ప్రభుత్వం ముందుగానే కృష్ణాబ్యారే జికె నీరు పంపింగ్ ఎందుకు చేయలేదు. ఇప్పుడు పంపింగ్ చేయడం సాధ్యంకాదని ఎందుకు చేతులుఎత్తింది. చెరువు లను నీటితో నింపి, నిర్మాణంలో ఉన్నప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈపరిస్థితుల్లో కూడా తాగు, సాగునీరు సమస్య తీరేదిగదా! ఇది పాలకుల వైఫల్యం కాదా !

-బొల్లిముంత సాంబశివరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

అన్నదాతలను కలవరపెడుతున్న వానాకాలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha