Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నగరాలపై కంపెనీల చూపు.. టాప్ లో వైజాగ్

నగరాలపై కంపెనీల చూపు.. టాప్ లో వైజాగ్

వార్త 18 hrs ago

Tier-2 : దేశంలోని మెట్రో నగరాలతో పాటు టైర్-2, టైర్-3 నగరాలు కూడా వేగంగా ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలుగా మారుతున్నాయని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదిక లింక్డ్‌ఇన్ (LinkedIn) తన 'సిటీస్ ఆన్ ది రైజ్ 2026' నివేదికలో వెల్లడించింది.

కృత్రిమ మేధస్సు (AI), తయారీ రంగం (Manufacturing), డిజైనింగ్, ఫైనాన్స్ వంటి కీలక రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఇప్పుడు చిన్న నగరాల వైపు తమ దృష్టిని సారిస్తున్నాయి. తక్కువ నిర్వహణ వ్యయం, మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన మానవ వనరులు లభిస్తుండటంతో కంపెనీలు తమ కేంద్రాలను అక్కడ విస్తరిస్తున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వేగంగా పెరుగుతున్నాయి.

దేశంలోనే ప్రథమ స్థానంలో వైజాగ్ - టాప్ 10 నగరాల జాబితా

లింక్డ్‌ఇన్ విడుదల చేసిన ఈ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టాప్ 10 నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నం అగ్రస్థానంలో నిలవడం విశేషం. సముద్ర తీర ప్రాంతం, మెరుగైన పోర్టు కనెక్టివిటీ, వేగంగా రూపుదిద్దుకుంటున్న ఐటీ వ్యవస్థ విశాఖను కంపెనీల తొలి ప్రాధాన్యతగా మార్చాయి. విశాఖపట్నం తర్వాత లూథియానా, సూరత్, వడోదర, ప్రయాగ్‌రాజ్, రాజ్‌కోట్, జబల్‌పూర్, రాంచీ, రాయ్‌పూర్ నగరాలు వరుసగా నిలవగా, ఆంధ్రప్రదేశ్ నుంచే మరో నగరం విజయవాడ కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ నగరాల ఎదుగుదల ప్రాంతీయ సమానాభివృద్ధికి మరియు స్థానిక నిరుద్యోగిత నివారణకు ఎంతో దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

నేటి నుంచి పొగాకు రైతులకు నగదు జమ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha