Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నైపుణ్య విద్యే ఉద్యోగ భద్రతకు పునాది

నైపుణ్య విద్యే ఉద్యోగ భద్రతకు పునాది

వార్త 0 months ago

Skill Education : దశాబ్దాలుగా భారతదేశంలో ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సులనే ఉపాధికి భరోసానిచ్చే విద్యగా భావించే అభిప్రాయం బలంగా నెలకొంది. మంచి ర్యాంకు వస్తే ఇంజినీరింగ్, అత్యుత్తమ ర్యాంకు వస్తే మెడిసిన్ అనే భావన 1 ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.

అయితే మారుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక విప్లవం, సేవారంగ విస్తరణ, నూతన పరిశ్రమల ఆవిర్భావం ఈ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. నేటి ఉ ద్యోగ విపణిలో డిగ్రీ కంటే నైపుణ్యానికే ఎక్కువ విలువ లభిస్తోంది. కేంద్ర గణాంకాల ప్రకారం 2022-23లో భారతదేశంలో సుమారు 1.09 కోట్ల మంది ఉన్నత విద్య ను పూర్తిచేశారు. అయితే ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ttu ప్రకారం పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న పట్టభద్రుల శాతం కేవలం 55 శాతం మాత్రమే. అంటే విద్య పూర్తిచేసి న ప్రతి ఇద్దరిలో ఒకరు మాత్రమే ఉద్యోగానికి తగిన నైపు ణ్యాలతో బయటకు వస్తున్నారన్న మాట. ఇదే భారత విద్యా వ్యవస్థ, పరిశ్రమల అవసరాల మధ్య ఉన్న అంతరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రతీ సంవత్సరం దేశంలో ను మారు 11 నుంచి 12 లక్షల మంది ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతుండగా, ఎంబీబీఎస్ ప్రవేశం పొందే అవకాశం మాత్రం సుమారు 70 నుంచి 80 వేల మంది విద్యార్థులకు మాత్రమే లభిస్తోంది. మిగిలిన లక్షలాది మంది యువతకు ఇతర రంగాల్లో అవకాశాలు కల్పించడం కాలానుగుణ అవ సరం, అందుకే ఉపాధి అవకాశాలను కేవలం రెండు కోర్సు లకు పరిమితం చేయడం సరైన దృక్పథం కాదు.

 Skill Education

Skill Education : ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన చోదకశక్తి

నేటి ప్రపంచంలో డేటా సైన్స్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, సైబర్ భద్రత, క్లౌడ్ కంప్యూటింగ్, డ్రోన్ టెక్నాలజీ, రోబో టిక్స్, సెమీకండక్టర్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పరిశ్రమల అంచనాల ప్రకారం డేటా సైన్స్, కృత్రిమ మేధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు సంవత్సరానికి 15 నుంచి 20 శాతం చొప్పున పెరుగుతున్నాయి. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహ నాలు, బ్యాటరీ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో కూడా నిపుణుల అవసరం గణనీయంగా పెరుగుతోంది. సేవారం గం భారత ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన చోదకశక్తిగా మారింది. దేశ జీడీపీలో ఈరంగం వాటా 55 నుంచి 60శాతం వరకు ఉంది. హాస్పిటాలిటీ, టూరిజం. ఫుడ్ టెక్నాలజీ, హెల్త్కేర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, లాజిస్టిక్స్, ఫ్యాషన్ డిజైన్, యానిమేషన్, గేమ్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, ఫిల్మ్ టెక్నాలజీ, అగ్రిటెక్, ఫిన్స్టక్ వంటి రంగాల్లో వేగంగా ఉద్యోగ అవకాశాలు పెరు గుతున్నాయి. కొన్ని రంగాల్లో వార్షిక నియామకాల వృద్ధి 8 4 నుంచి 12 శాతం వరకు నమోదవుతోంది. ప్రతి సంవత్స రం దేశంలో 25 నుంచి 30 లక్షల మంది యువత ఐటీఐ లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వృత్తి శిక్షణా సంస్థల్లో చేరు తున్నారు. సరైన శిక్షణ పొందిన అభ్యర్థులకు నా దేశీయంగానే కాక విదేశాల్లో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సమాచార సాంకేతికం, ఎలక్ట్రిక్ వాహనాల నిర్వ హణ, పారిశ్రామిక నిర్వహణ, వెల్డింగ్ ఆటోమేషన్ వంటి రంగాల్లో విదేశీ నియామకాలు 2 పెరుగుతున్నాయి.

 Skill Education

నవకల్పన పట్ల ఆసక్తి

ఇంటర్న్ షిప్లకు కూడా నేటి ఉద్యోగ విపణిలో విశేష ప్రాధాన్యం ఏర్పడింది. పరిశ్రమల అధ్యయనాల ప్రకారం ఇంటర్న్షిప్ పూర్తి చేసిన విద్యార్థుల్లో 30 నుంచి 60 శాతం మంది అదే సంస్థల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. మరోవైపు, పరిశ్రమల్లో నైపుణ్యాల కొరత కారణంగా సుమారు 40 నుంచి 50 శాతం ఉద్యోగాలకు అదనపు శిక్షణఇవ్వాల్సి వస్తోందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య AP బలమైన అనుసంధానం అవసరాన్ని స్పష్టంచేస్తోంది. ప్రభు త్వం కూడా విద్యావిధానంలో సమతుల్య దృక్పథాన్ని అవ లంబించాలి. ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యకు ఎంత ప్రాధా న్యం ఇస్తుందో, నైపుణ్యాధారిత, బహుళశాఖల, వృత్తి విద్యా కోర్సులకు కూడా అంతే ప్రాధాన్యం కల్పించాలి. ప్రతి జిల్లా లో ఆధునిక స్కిల్ యూనివర్సిటీలు, ఫినిషింగ్ స్కూల్స్, పరిశ్రమల భాగస్వామ్యంతో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పాఠశాలస్థాయి నుంచే కెరీర్ కౌన్సెలింగ్ను తప్పని సరి చేసి, విద్యార్థుల అభిరుచి, సామర్థ్యానికి అనుగుణంగా కోర్సుల ఎంపికకు మార్గనిర్దేశం చేయాలి. స్టార్టర్లు, స్వయం ఉపాధి, డిజిటల్ ఆంత్రప్రెన్యూర్షిప్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలి. దేశ A అభివృద్ధికి వైద్యులు, ఇంజినీర్లు ఎంత అవసరమో, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, ఫార్మసీ పరిశోధకులు, బయోటెక్నాలజిస్టులు, డేటా విశ్లేషకులు, డిజై నర్లు, ఆరోగ్య సేవల నివుణులు, సృజనాత్మక రంగాల ప్రతి భావంతులు కూడా అంతే అవసరం. ఉపాధిని నిర్ణయించేది కోర్సు కాదు. కాలానుగుణ నైపుణ్యం, నిరంతర అభ్యాసం, సృజనాత్మకత, నవకల్పన పట్లఆసక్తి. ఈఅవగాహన విద్యా ర్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, విధాన నిర్ణేతల్లో పెరిగినప్పుడే భారత యువశక్తి ప్రపంచ ఉద్యోగ విపణిలో మరింత సమర్ధంగా నిలబడగలదు.

-సి. హెచ్.ప్రతాప్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ హోదా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha