నల్లగొండ జిల్లా దేవరకొండలో బ్యాంకు డిపాజిటర్లు గగ్గోలు నలుగురు నిందితుల అరెస్టు
Fake KYC Bank Fraud: నకిలీ కేవైసితో బ్యాంకు ఖాతాదారుల డబ్బులు కాజేసిన ముఠాను దేవరకొండ పోలీసులు అరెస్టు చేసి వారివద్ద నుంచి రెండు కోట్ల నలబై రెండు లక్ష పదివేల రూపాయల నగదు, 6 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా పోలీసు కేంద్రంలో మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియా సమావేశములో వివరాలు వెల్లడించారు.
Deverakonda Bank Fraud: Four arrested
Fake KYC Bank Fraud: మోసానికి పన్నాగం ఇలా..
దేవరకొండ ఎస్బీఐ అగ్రికల్చరల్ కమర్షియల్ బ్రాంచిలో కాంట్రాక్ట్పద్దతిలో హౌస్ కీపింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న లెండల చక్రపాణి తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో బ్యాంక్ సిబ్బందికి కంప్యూటర్ పనుల్లో సహాయం చేసేవాడు. ఆ చనువుతో సిబ్బంది లాగిన్ పాస్వర్డ్లను తెలుసుకుని లాగిన్ అయి బ్యాంకు లోని ఇతర ఎస్ బి ఐ బ్రాంచి ల లోని ఖాతాలను గమనించేవాడు. ఆపరేట్ చేయని ఖాతాల్లో డబ్బులు ఉండటాన్ని గమనించిన చక్రపాణి వాటిని కొట్టేయ్యాలని పధకం వేసాడు. పనిచేస్తున్న బ్రాంచిలో డబ్బులు కాజేస్తే దొరికిపోతామని భావించి..
అదే ఎస్బీఐ బ్యాంకు బ్రాంచిలను ఖాతాలపై దృష్టిసారించాడు. ఈ క్రమములో నే అతనికి సూర్యాపేట ఎస్ బి ఐ మెయిన్ బ్రాంచ్ లో పనిచేసే బ్యాంక్ మేనేజర్ పుట్ట వెంకట రామాంజనేయులుతో పరిచయం ఏర్పడింది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా అక్రమంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న చక్రపాణి, రామాంజనేయులు తో కలిసి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా ఖాతాలలో ఎక్కువగా డబ్బులు ఉండి గత కొన్ని సంవత్సరాలుగా ట్రాన్సాక్షన్ లు జరగని 10 ఇనాక్టివ్ బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించాడు.
నకిలీ పత్రాల సృష్టి
ఆ ఖాతాదారుల వివరాలు ఆధార్, పాన్, ఫోటో సంతకం వివరాలను సేకరించి, రేఖ ప్రింట్ ఇన్ఫో సైట్ ద్వారా నకిలీ ఆధార్, పాన్ కార్డులను తయారు చేశారు. బ్యాంక్ ఉద్యోగుల లాగిన్ లతో బ్యాంకు కంప్యూటర్ లోకి లాగిన్ అయి, ఖాతాలకు కొత్త మొబైల్ నంబర్ అప్డేట్ చేశారు. అనంతరం యోనో యాప్ ద్వారా కొత్త యూసర్ ఐడీ పాస్వర్డ్, పిన్ సృష్టించి చక్రపాణి కి పరిచయం ఉన్న బ్యాంకు రికవరి ఏజెంట్ కేతావత్ రాంలాల్, ఫొటో గ్రాఫర్ మారేపల్లి శివ ల ద్వారా వారికి పరిచయం ఉన్న వ్యక్తుల కు కమీషన్ అశ చూపి వారి అకౌంట్లలో యోనో యాప్ ద్వారా ఆ ఖాతాల నుండి నగదును ఇతర వ్యక్తుల ఖాతాలకు ఆన్లైన్ ద్వారా బదిలీ చేసేవారు.
ఖాతాదారుడి పిర్యాదు తో మోసం వెలుగులోకి
హైదరాబాద్ కోటి ఎస్ బి ఐ బ్రాంచ్ లో పల్లటి నరేందర్ అనే వ్యక్తి కి చెందిన ఖాతా కు కేవైసి అప్డేట్ అయినట్లు ఇమెయిల్ ద్వారా అలర్ట్ మెసేజ్ వెళ్లింది. దీంతో నరేందర్ వెంటనే బ్యాంక్ ను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. నరేందర్ పిర్యాదు తో విచారణ చేపట్టిన బ్యాంకు అదికారుల కు దేవరకొండ బ్రాంచి లో కేవైసి అప్డేట్ చేసినట్లు గుర్తించారు. అక్కడ మేనేజర్ ఇచ్చిన సమాచారం తో బ్రాంచ్ మేనేజర్ ఫణీంద్ర నీలకంఠ వెంకట రాఘవపూడి తమ శాఖ లో రూ.2,65,55,268 నకిలీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పోలీసుల దర్యాప్తు – నిందితుల అరెస్టు
బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు తో కేసు నమోదు చేసి దేవరకొండ డీఎస్పీ ఎం.వి. శ్రీనివాస రావు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసి, సి ఐ పి. వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సమన్వయంతో సాంకేతిక శాస్త్రీయ ఆధారాలను సేకరించి, వివిధ ప్రాంతాల్లో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,42,10,000 నగదు, 6 స్మార్ట్ మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పి తెలిపారు. విచారణలో అక్రమంగా సంపాదించిన మొత్తాన్ని లెండల చక్రపాణి, పుట్ట వెంకట రామాంజనేయులు కి 45 శాతం, సహాయం చేసిన కేతావత్ రాంలాల్, మారేపల్లి శివ లకు 10 శాతం వాటాలుగా పంచుకునే వారని చెప్పారు. నిందితులను అరెస్టు చేయటములో ప్రతిభ కనబరిచిన ఎస్ ఐ రాజు, కానిస్టేబుల్స్ యల్. వీరబాబు, ఫయాజ్, చాంద్ పాషా,వి. సింహాద్రి, సోమ్లా లను జిల్లా ఎస్పీ అభినందించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

