Dailyhunt
నక్సలైట్ల ఏరివేతపై ముగిసిన ఆపరేషన్ కగార్

నక్సలైట్ల ఏరివేతపై ముగిసిన ఆపరేషన్ కగార్

వార్త 3 weeks ago

Operation Kagar: మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం చేబట్టిన ఆపరేషన్ కగార్ కు గత నెల 2వ తేదీన గడువు ముగియడంతో అజ్ఞాతంలో వున్న మావోయిస్టుల లొంగుబాటుకు తెలంగాణ, చత్తీస్ ఘడ్ పోలీసులు మరోమారు ప్రయత్నాలు చేబట్టారు.

మావోయిస్టుల లొంగుబాటు తెలంగాణ, చత్తీస్ ఘడ్ లోనే ఎక్కువగా జరగడంతో ఈ విషయంలో కేంద్రం కూడా రెండు రాష్ట్రాల పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది, ఇప్పటికే లొంగిపోయిన నక్సలైట్ల హకారంతో అజ్ఞాతంలో వున్న వారికి నచ్చచెప్పి సజీవన స్రవంతిలో వచ్చేలా చేసేందుకు రెండు రాష్ట్రా పోలీసులు తమవంతు కృషి చేయసాగారు. శ్వాసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ పోలీసుల బందు రెండు లేదా మూడు రోజుల్లో పెద్ద సంఖ్యలో యుధాలతో నక్సలైట్లు లొంగిపోతున్నారని తెలిసింది. ఐదులో సుధీర్ఘ కాలంగా అజ్ఞాతంలో వున్న 38 మంది క్సలైట్లలో కొందరు వున్నట్లు తెలిసింది.

Read Also: Kazipet Railway Line : రవాణాలో పెద్ద మార్పులు రానున్నాయి

 Operation Kagar ends after clearing Naxalites

Operation Kagar: మావోయిస్టుల శకం ముగింపు

దేశంలో మావోయిస్టుల శకం ముగిసిందని కేంద్రం ప్రకటించడంతో ఛత్తీస్మడ్ దండకారణ్యంలో మిగిలిపోయిన వంద నుంచి 200 మంది వర కు నక్సలైట్లను కూడా బొంగిపోయేలా చేసేందుకు పోలీసుల ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అజ్ఞాతంలో వున్న వారిలో కొందరు 20 నుంచి 25 ఏళ్లుగా నక్సలిజంలో వున్న వారు కావడం గమనార్హం. అజ్ఞాతంలో వున్న 38 మంది ఆచూకీ తెలియడం లేదని, వీరిలో కొందరు వయో భారంతో చనిపోయి వుండవచ్చని, ఇంకొందరు అంతర్గత కలహాల వల్ల హత్యకు గురై వుండవచ్చని పోలీసులు ఇదివరకే ప్రకటించగా వీరి సంఖ్య ఎంత అనేది చెప్పలేదు. అజాతంలో వున్న వారి సంఖ్య 55 గా పోలీసులు చెప్పినా ఆ తరువాత ఈ సంఖ్యను 38గా ప్రకటించారు. వీరిలో కొందరు చనిపోయి వుంటారని కూడా పోలీసులు తెలిపారు. అయినప్పటికీ 20 మంది నక్సలైట్లు కచ్చితంగా జీవించి వుంటారని పోలీసుల అంచనా.

మావోయిస్టుల లొంగుబాటుకు పోలీసుల యత్నం

గతంలో అజ్ఞాతం లో వున్న నక్సలైట్ల యోగక్షేమాలు గ్రామాలలో వుండే వారి కుటుంబాలకు మావోయిస్టుల తరపున పనిచేసిన కొరియర్లు చెబుతుండేవారు. ఒకవేళ ఎ వరైనా ఎన్కౌంటర్లలో చనిపోతే వారి కుటుంబాలకు పార్టీ తరపున సమాచారం అందడంతో పాటు కొంతమేర ఆర్థిక సహాయం కూడా అందేది. అ యితే దేశంలో నక్సలిజం నిర్మూలనకు కేంద్రం చేబట్టిన ఆపరేషన్ కగార్ 1, కగార్ 2 తరువాత మావోయిస్టులు వందల సంఖ్యలో లొంగిపోవడం, పదుల సంఖ్యలో ఎన్కౌంటర్లలో మరణించిన దరిమిలా అజ్ఞాతంలో వున్న వారి ఆచూకీ వారి కుటుంబాలకు తెలియరావడం లేదు.

అయితే దేశం లో ఇప్పుడు మావోయిస్టుల శకం ముగిసిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పడంతో మిగిలిపోయిన వారిని జనజీవనస్రవంతిలో తెచ్చేందుకు. తెలంగాణ పోలీసులు ఓవైపు ఛత్తీస్ ఘడ్ పోలీసులు మరోవైపు, ప్రయత్నాలు చేస్తుండగా వీరికి ఆయా ప్రాంతాల నేతలు, నక్సల్స్ సానుభూతిప రులు సహకరిస్తున్నారు. అయితే ఇంతమంది నక్సలైట్లు లొంగిపోయినా అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి అధూకీ మాత్రం ఇంత వరకు తెలియరాలేదు. ఆయన విదేశాల్లో వున్నాడని వెబతున్నా ఎక్కడ తలదాచుకున్నాడనే దానిపై పోలీసులు వద్ద కచ్చితమైన సమాచారం లేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మహిళా సంఘాలకు మరో తీపి కబురు తెలిపిన రేవంత్ సర్కార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha