NBK 112 Official Announcement: నందమూరి బాలకృష్ణ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో సినిమా అంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. బాలయ్య మాస్ ఇమేజ్, కొరటాల శివ సామాజిక సందేశం కలిస్తే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్లే.
NBK 112:
ఈ చిత్రానికి "Power Meets Purpose, Mass Becomes A Movement" అనే అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చారు. దీనిని బట్టి బాలయ్య మార్క్ ఊరమాస్ యాక్షన్‌కు, కొరటాల శైలి సోషల్ మెసేజ్ తోడవబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను యువసుధ ఆర్ట్స్, SLV సినిమాస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నాయి.
కొరటాల శివతో 'దేవర' చిత్రాన్ని నిర్మించిన సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. యువ సుధ ఆర్ట్స్ బ్యానర్ పై త్వరలో షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర బృందం తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడించనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
జెట్లీ మూవీ రివ్యూ: సత్య కామెడీ మ్యాజిక్ రిపీట్ అయిందా?

