Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై షర్మిల ఆగ్రహం

నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసంపై షర్మిల ఆగ్రహం

వార్త 2 months ago

YSR Statue Vandalism: నంద్యాల జిల్లాలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తి ధ్వంసం చేయడంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధ్వంసమైన విగ్రహం స్థానంలో తక్షణమే కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించకపోతే, నంద్యాల కేంద్రంగా తానే స్వయంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఆమె హెచ్చరించారు. ఈ ఘాతుకాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read also: Chandrababu Naidu: చంద్రబాబు పాలనపై సజ్జల రామకృష్ణా రెడ్డి తీవ్ర విమర్శలు

పోలీసుల తీరుపై మండిపడ్డ షర్మిల

నంద్యాలలోని శ్రీనివాస సెంటర్‌లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఒక వ్యక్తి బహిరంగంగా ధ్వంసం చేస్తుంటే, అక్కడే ఉన్న పోలీసులు మూగప్రేక్షకుల్లా ఉండిపోవడంపై షర్మిల మండిపడ్డారు. పట్టపగలు ఇంత జరుగుతున్నా అడ్డుకోకపోవడం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తికి ‘మానసిక స్థితి సరిగ్గా లేదు’ అంటూ పోలీసులు ఈ వ్యవహారాన్ని చాలా సులువుగా కొట్టిపారేయడాన్ని ఆమె తప్పుబట్టారు.

YSR Statue Vandalism: చంద్రబాబు సర్కార్‌పై రాజకీయ కక్ష సాధింపు ఆరోపణలు

ఈ ఘటన వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష సాధింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయని షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు జరుగుతుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూడటం సిగ్గుచేటని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ విగ్రహాల రక్షణ బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని ఆమె స్పష్టం చేశారు.

విగ్రహం పునరుద్ధరించకుంటే ఆమరణ దీక్ష!

ఈ దాడికి పాల్పడిన నిందితుడితో పాటు, అతని వెనుక ఉండి నడిపించిన సూత్రధారులను కూడా గుర్తించి కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. తక్షణమే నంద్యాల శ్రీనివాస సెంటర్‌లో కొత్త వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో అదే స్థలంలో తానే స్వయంగా ఆమరణ దీక్షకు కూర్చుంటానని సీఎం చంద్రబాబును హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

ఏపీకి వర్ష సూచన.. 17 మండలాల్లో వడగాల్పుల హెచ్చరిక!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha