Dailyhunt
Nandyal District: నంద్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Nandyal District: నంద్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో విషాదకర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. డోన్ సమీపంలోని ఉడుములపాడు వద్ద పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనం స్పష్టంగా కనిపించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒకే ద్విచక్ర వాహనంపై సొంత గ్రామం నుంచి విధులకు బయలుదేరారు. ఈ క్రమంలో రహదారిపై ఎదురుగా వస్తున్న ఎండ్లబండి కనిపించక బైక్‌ను ఢీకొట్టారు.

Read also: Prakasam crime: వివాహేతర సంబంధం.. కాటికి ఇద్దరి ప్రాణాలు

Road accident in Nandyal

ఈ ప్రమాదంలో కె. సురేంద్ర (26) అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన రాజశేఖర్ (24)ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు. మరో గార్డు వై. సురేంద్ర ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. పొగమంచు సమయంలో రహదారులపై జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha