Dailyhunt
నన్ను కొట్టారు.. ప్రజా తీర్పును దొంగిలించారు: మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

నన్ను కొట్టారు.. ప్రజా తీర్పును దొంగిలించారు: మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

వార్త 3 days ago

శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పరాజయం పాలైన నేపథ్యంలో, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన కీలక అంశాలు.

ఫోన్ కాల్ లీక్: టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీతో మమతా బెనర్జీ మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కౌంటింగ్ కేంద్రంలో జరిగిన పరిణామాలను ఆమె ఈ కాల్‌లో వివరించారు. భవానీపూర్ నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రంలో కొందరు గూండాలు ప్రవేశించి తనపై భౌతిక దాడికి దిగారని మమతా ఆరోపించారు. కేంద్ర బలగాల (CRPF) సాయంతో తమ ఏజెంట్లను బయటకు పంపించివేశారని ఆమె పేర్కొన్నారు.

Read Also: Tamil Nadu Election: రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. విజయ్ వ్యూహం ఫలించేనా?

 W.Bengal Results

W.Bengal Results: కౌంటింగ్ అక్రమాలు

తుది రౌండ్ల కౌంటింగ్ సమయంలో భారీ అక్రమాలు జరిగాయని, కీలక సమయంలో తనను కౌంటింగ్ హాల్‌లోకి రానివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును అనైతిక రీతిలో దొంగిలించారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 206 స్థానాలతో ఘనవిజయం సాధించగా, టీఎంసీ కేవలం 81 స్థానాలకే పరిమితమైంది. స్వయంగా మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో ఓటమి చవిచూడటం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha